ఎయిర్ హోస్టెస్ గా అనసూయ..!

జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతూనే మరో పక్క వెండితెర మీద సత్తా చాటుతుంది.అమ్మడు ఏ సినిమా చేసినా అందులో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడుతుంది.

 Anasuya Air Hostess In Jayashankar Movie-TeluguStop.com

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.ఈమధ్యనే థ్యాంక్ యు బ్రదర్ సినిమాలో ప్రెగ్నెన్సీ ఉమెన్ గా కనిపించి ప్రేక్షకుల మనసులు గెలిచింది అనసూయ.

ఇక లేటెస్ట్ గా అనసూయ మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది.సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా నటిస్తుందని తెలుస్తుంది.

 Anasuya Air Hostess In Jayashankar Movie-ఎయిర్ హోస్టెస్ గా అనసూయ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పేపర్ బోయ్, విటమిన్ షి సినిమాలను డైరెక్ట్ చేసిన జయశంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.హీరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియదు కాని అనసూయ స్పెషల్ రోల్ లో అలరిస్తుందని మాత్రం తెలుస్తుంది.

ఈ సినిమాతో అనసూయ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.జబర్దస్త్ షోలో తన అందాలతో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం తన నటనతోనే మెప్పిస్తానని అంటుంది.

అయితే షోలతో పాటుగా అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తూ వస్తుంది.

#Jayashankar #Jayashankar #Rangasthalam #Anasuya #AnasuyaAir

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు