మాల్ ఉందా? ఇంటికి రా ఎరేంజ్ చేస్తా... ఆర్యన్‌, అనన్య చాటింగ్‌

బాలీవుడ్‌ బిగ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులుగా జైల్లో కూర్చుని ఉన్నాడు.ఎన్‌ సీ బీ అధికారులు అతడి పై కఠిన సెక్షన్స్ తో కేసు నమోదు చేయడం జరిగింది.

 Ananya Pandy And Aryan Khan Whats App Chat Leaked-TeluguStop.com

అరెస్ట్‌ అయిన వెంటనే ఆర్యన్ మొబైల్‌ ను అన్‌ లాక్ చేయడం జరిగింది.డ్రగ్స్ కేసులో ఉన్న ఆర్యన్ వాట్సప్‌ చాట్‌ తో పాటు ఇతర విషయాల గురించి కులంకశంగా ఎంక్వౌరీ చేస్తున్నారు.

ఆర్యన్‌ మొబైల్‌ లో అనన్య పాండేతో చాటింగ్‌ చేసినట్లుగా ఉంది.ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా అందరికి తెలిసిన విషయమే.

 Ananya Pandy And Aryan Khan Whats App Chat Leaked-మాల్ ఉందా ఇంటికి రా ఎరేంజ్ చేస్తా… ఆర్యన్‌, అనన్య చాటింగ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ చాట్‌ లో ఆర్యన్ మాల్ ఉందా అంటూ ప్రశ్నించాడు.ఇంటికి వస్తే ఎరేంజ్ చేస్తాను తప్పకుండా అంటూ అనన్య పాండే సమాధానం ఇచ్చింది.

ఇప్పుడు ఆ సమాధానమే ఆమెకు పెద్ద చిక్కులు తెచ్చి పెట్టింది.ఆమెను చిక్కుల్లో పడేసిన ఆ వాట్సప్ చాట్‌ గురించి అనన్య పాండే ఏం సమాధానం చెబుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే రెండు సార్లు విచారణ ఎదుర్కొన్న అనన్య పాండే ఆ విషయమై విచారణ అధికారులకు తాను ఆర్యన్ మంచి స్నేహితులం.ఇద్దరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటాం.

అతడు సరదాగా మాల్‌ ఉందా అని అడిగాడు.నేను అంతే సరదాగా ఇంటికి వస్తే ఎరేంజ్ చేస్తాను అన్నాను.

అంతే తప్పు నాకు డ్రగ్స్ కు అస్సలు సంబంధం లేదు అంటూ అనన్య పాండే కన్నీరు పెట్టుకుందట.మళ్లీ మళ్లీ అనన్య పాండేను విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నేడు మరోసారి ఆమెను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు.మొన్ననే అనన్యను విచారణకు హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు ఇవ్వగా అనారోగ్య సమస్య చూపించి ఆమె విచారణ కు దూరంగా ఉంది.

మళ్లీ ఆమెకు నోటీసులు ఇవ్వడం జరిగింది.ఆమె విచారణ లో ఈసారి ఏమైనా చెప్తుందా అనేది చూడాలి.

ప్రస్తుతం అనన్య పాండే లైగర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.చిత్ర యూనిట్‌ సభ్యులు అనన్య ఒక వేళ అరెస్ట్‌ అయితే పరిస్థితి ఏంటీ అన్నట్లుగా ఆందోళనలో ఉన్నారట.

#Ananya Pandy #Drugs #Aryan Khan #Drugs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube