టాలీవుడ్‌పై ఆశలు పెంచుకుంటున్న రౌడీ స్టార్‌ బ్యూటీ  

Heroine Ananya Pandey Looking for Tollywood offers, Ananya Pandey, Viajy Devarakonda, karan Johar - Telugu Ananya Pandey, Heroine Ananya Pandey Looking For Tollywood Offers, Karan Johar, Viajy Devarakonda

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లో కూడా పరిచయం అయ్యేందుకు సిద్దం అయ్యింది.

 Ananya Pandey Interested Tollywood Offers

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఈమె విజయ్‌ దేవరకొండతో కలిసి పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది.ఇప్పటికే సగంకు పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

ఆ సినిమాతో టాలీవుడ్‌లో పాగా వేయాలని అనన్య ఆరాటపడుతోంది.

టాలీవుడ్‌పై ఆశలు పెంచుకుంటున్న రౌడీ స్టార్‌ బ్యూటీ-Movie-Telugu Tollywood Photo Image

అనన్య పాండేకు కరణ్‌ జోహార్‌ లైఫ్‌ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే బాలీవుడ్‌లో నెపొటిజం అంటూ ఎక్కువ ప్రచారం జరుగుతోంది.ఈ సమయంలో అనన్య ఏ సినిమా చేసినా ఎలా ఆఫర్‌ దక్కించుకున్నా కూడా స్టార్‌ వారసురాలు అనే ముద్ర వేస్తారు.

అందుకే ఆమె ఆ ముద్రను పోగొట్టుకునేందుకు మొదట టాలీవుడ్‌లో మంచి స్టార్‌ అనిపించుకుని ఆ తర్వాత బాలీవుడ్‌లో తనదైన శైలితో నటించి మెప్పించి తన తండ్రి ముద్రను తొలగించుకోవాలనుకుంటుందట.

ఫైటర్‌ చిత్రం తర్వాత ఖచ్చితంగా తనకు టాలీవుడ్‌లో ఆఫర్లు వస్తాయనే ఆశతో ఉన్న అనన్య పాండే బాలీవుడ్‌లో సినిమాల సంఖ్య తగ్గించింది.త్వరలోనే ఈమె టాలీవుడ్‌లో మరో సినిమాకు కమిట్‌ అయ్యే అవకాశం ఉంది.ఆమద్య మహేష్‌ బాబుకు జోడీగా అన్నారు.

కాని అది నిజం కాదని తేలిపోయింది.ఈ సమయంలో మరో యంగ్‌ హీరో కోసం కూడా స్టార్‌ నిర్మాత ఈమెను సంప్రదించాడట.

ఆ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది.బాలీవుడ్‌ వదిలి టాలీవుడ్‌పై పడుతున్న ఈ అమ్మడికి సక్సెస్‌ దక్కేనా చూడాలి.

#Karan Johar #HeroineAnanya #Ananya Pandey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ananya Pandey Interested Tollywood Offers Related Telugu News,Photos/Pics,Images..