రౌడీ హీరోను చాలా మిస్ అవుతున్న బ్యూటీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా కరోనా వైరస్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.

 Ananya Pandey, Fighter, Vijay Devarakonda, Puri Jagannadh-TeluguStop.com

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అదిరిపోయే లుక్‌తో పాటు అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.

ఇక అనన్య పాండేతో విజయ్ రొమాన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించనున్నాడు పూరి.ఈ సినిమాను మెజారిటీ శాతం ముంబైలో షూట్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

అయిత ఇటీవల షూటింగ్‌లో విజయ్‌తో కలిసి వర్క్ చేస్తున్న అనన్య చాలా క్లోజ్ అయ్యిందట.

కాగా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో విజయ్‌ను అనన్య చాలా మిస్ అవుతుందట.

పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రిలీజ్ చేయనున్నాడు.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube