పూరి సినిమాలో స్టంట్స్ చేయబోతున్న బాలీవుడ్ భామ అనన్య  

ఈ మధ్య కాలంలో హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా సినిమాలలో వారి టాలెంట్ చూపిస్తున్నారు.యాక్షన్ సీక్వెన్స్ కూడా కూడా ఇరగదీస్తున్నారు.

TeluguStop.com - Ananya Panday To Have Action Sequences In Fighter

యాక్షన్ మూవీస్ కోసం వారి ఫిట్ నెస్, బాడీ షేప్స్ కూడా పెర్ఫెక్ట్ గా మెయింటేన్ చేస్తున్నారు.ఇప్పటికే ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే,కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, సోనాక్షి సిన్హా లాంటి బాలీవుడ్ భామలు యాక్షన్ మూవీస్ చేసి వారిలోనే యాక్షన్ టాలెంట్ చూపించారు.

ఇప్పుడు మరో అందాల భామ తనలోని యాక్షన్ టాలెంట్ ని చూపించడానికి రెడీ అవుతుంది.ఈ అమ్మడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనన్యా పాండే.

TeluguStop.com - పూరి సినిమాలో స్టంట్స్ చేయబోతున్న బాలీవుడ్ భామ అనన్య-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం విజయ్ దేవరకొండకి జోడీగా ఫైటర్ మూవీలో ఈ అమ్మడు నటిస్తుంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపధ్యంలో ఉండబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన వాయిదా పెద్ద ఈ సినిమా మరల రీషెడ్యూల్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఫైటర్ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అనన్యా పాండే చెప్పుకొచ్చింది.పూరి జగన్నాథ్ సినిమాలో తనకి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని ఈ అమ్మడు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.యాక్షన్ సన్నివేశాలలో తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది.కొత్తగా తనని తాను ప్రెజెంట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా అని దీని కోసం త్వరలో బాక్సింగ్ లో కిక్ లు ఇవ్వడానికి రెడీగా ఉన్నానని ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండలేనని అనన్యా పాండే చెప్పుకొచ్చింది.

ఆమె మాటల బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమాలో పూరి అనన్యని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కాకుండా కాస్తా ప్రాధాన్యత ఉన్నపాత్ర ఇస్తున్నాడని అర్ధమవుతుంది.

#Ananya Panday #Puri Jagannadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు