అనన్యా పాండే కావాలంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వివి వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

 Ananya Panday Romance With Bellamkonda, Tollywood, Bollywood, Bellamkonda Sriniv-TeluguStop.com

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.బెల్లంకొండ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే ముంబై Sబ్యాక్ డ్రాప్ లో, మాఫియా ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథనం ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టాలని బెల్లంకొండ శ్రీనివాస్ వెయిట్ చేస్తున్నాడు.

అక్కడ కూడా తనని కమర్షియల్ హీరోగా ప్రాజెక్ట్ చేసుకోవడానికి చత్రపతి బెస్ట్ ఆప్షన్ భావిస్తున్నాడు.ఇప్పటికే క్యాస్టింగ్ మేగ్జిమం ఫైనల్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ లో చాలా మంది యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్స్ ని ట్రై చేశారు.అయితే చత్రపతి కథలో హీరోయిన్ పాత్రకి అంత ప్రాధాన్యత ఉండదు.

దానికితోడు డెబ్యూ హీరో కావడంతో స్టార్ కథానాయికలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదనేది టాక్.ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండకి జోడీగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తున్న అనన్యా పాండేని చత్రపతి రీమేక్ కోసం అడిగినట్లు తెలుస్తుంది.

అలాగే ఆమెకి రెమ్యునరేషన్ గట్టిగా ఆఫర్ చేయడంతో అనన్యా చేయడానికి ఒకే చెప్పిందని బోగట్టా.హీరోయిన్ కి సంబంధించి త్వరలో అధికారికంగా కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందని బిటౌన్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube