గ్లామర్ రంగంలో నాకు జరిగింది ఇదే.. అనన్య నాగల్ల వైరల్ కామెంట్స్!

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి అనన్య నాగల్ల. తెలంగాణ భాషతో అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల హృదయాలలో నిలిచింది ఈ తెలుగు అమ్మాయి.

 Heroine Ananya Nagalla Tells Her Life Before Movies,  Ananya Nagalla, Vakeel Saa-TeluguStop.com

తన అందం వలలో యువతను కట్టిపడేసింది.ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన అనన్య నిత్యం ఫోటో షూట్ లతో తెగ బిజీగా మారింది.

అంతేకాకుండా గ్లామర్ ను కూడా పరిచయం చేసింది ఈ బ్యూటీ.నడుము అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది.

ఇక తనకు సంబంధించిన విషయాల గురించి కొన్ని కామెంట్స్ చేసింది.

మొదట ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది అనన్య.

ఈ సినిమాలో మల్లేశం భార్యగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో అనన్య కెరీర్ మలుపు తిరిగిందనే చెప్పవచ్చు.

ఇండస్ట్రీకి ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ఇక్కడ వరకు చేరుకుంది.ఇక ప్లే బ్యాక్ సిరీస్ తో కూడా మంచి గుర్తింపు అందుకుంది.

Telugu Ananya Nagalla, Career Offers, Glamor Field, Bee, Mallesham, Pawan Kalyan

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య కొన్ని విషయాలు పంచుకుంది.ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు కూడా ఛాన్సులు వస్తాయనడానికి తనే ఉదాహరణ అని తెలిపింది.ప్రస్తుతం తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని.అసలు తను నటిని అవుతానన్న ఆలోచనలు కూడా తనలో లేవని తెలిపింది.కానీ ఇప్పుడు ఆర్టిస్టుగా చాలా సంతోషంగా ఉందని, షార్ట్ ఫిలిమ్స్ తో మొదలైన తన కెరీర్ పెద్ద సినిమాల వరకు అవకాశాలు అందుకున్నట్లు తెలిపింది.

Telugu Ananya Nagalla, Career Offers, Glamor Field, Bee, Mallesham, Pawan Kalyan

అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకు అవకాశాలు రావడం సులభమని, కానీ దొరికిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమని తెలిపింది.ఇక గ్లామర్ రంగంలో అమ్మాయిలకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయని విన్మదట.కానీ తనకు ఎప్పుడు గ్లామర్ విషయంలో అలాంటి ఇబ్బందులు ఎదురు కాలేవని తెలిపింది.

ఇక కొన్ని విషయాలు పంచుకున్న అనన్య పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా అదృష్టం అని తెలిపింది.మొదట్లో ఆయనను చూసినప్పుడు చాలా భయపడిందట.ఇక ఆయన తనను ఎక్కడి నుండి వచ్చావని కొన్ని విషయాలు అడగటంతో కాస్త కంఫర్టబుల్ గా అనిపించిందని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube