దాని కోసం ఎంతదూరమైనా వెళ్తా.. అనన్య కామెంట్స్ వైరల్..?

మల్లేశం, ప్లే బ్యాక్ సినిమాలలో నటించి తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.అయితే ఈ సినిమాలతో పోలిస్తే వకీల్ సాబ్ సినిమా ద్వారా అనన్య నటనకు మంచి పేరు వచ్చింది.

 Ananya Nagalla Remembers Mallesham Movie Memories-TeluguStop.com

అనన్య పాత్రకు డైలాగులు ఎక్కువగా లేకపోయినా తన నటనతో అనన్య ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్నారు.సినిమాల్లోకి రాకముందు కొన్ని లఘుచిత్రాల్లో నటించిన అనన్య సినిమాలు చేస్తూ వెండితెర దర్శకులను ఆకర్షించారు.

వకీల్ సాబ్ తరువాత అనన్యకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.తాజాగా అనన్య సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Ananya Nagalla Remembers Mallesham Movie Memories-దాని కోసం ఎంతదూరమైనా వెళ్తా.. అనన్య కామెంట్స్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వీడియోలో అనన్య గచ్చకాయలు ఆడుతున్నారు.మల్లేశం సినిమాలోని పద్మ పాత్రకు సంబంధించిన మెమరీస్ అంటూ అనన్య ఆ వీడియోను షేర్ చేశారు.

పద్మ పాత్రలోకి వెళ్లడానికి తాను ఫాలో అయిన ఫాలో అయిన ప్రాసెస్ ఇది అని ఆమె చెప్పుకొచ్చారు.

మల్లేశం మూవీ కొరకు తాను పల్లెలకు వెళ్లి పల్లెల్లో ఆడే ఆటలు, భాష, యాస, ప్రవర్తన గురించి తెలుసుకున్నానని అనన్య పేర్కొన్నారు.

ఆన్ స్క్రీన్ లో చేసే పాత్ర కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమని అనన్య అన్నారు.ప్రేక్షకులను అలరించడానికి ఎంత దూరమైనా వెళతానని అనన్య చెప్పుకొచ్చారు.తన నటనపై నమ్మకంతో పద్మ పాత్రను ఆఫర్ చేసినందుకు మేకర్స్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ మంది సక్సెస్ అయ్యారు.ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లు సక్సెస్ సాధించిన స్థాయిలో తెలుగు హీరోయిన్లు సక్సెస్ సాధించలేకపోతున్నారు.అనన్య అయినా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారో లేదో చూడాల్సి ఉంది.

అనన్య నటనకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అవుతుండటం గమనార్హం.

#Ananya Memories #Comments Viral #Social Media #Play Back Movie #Ananya Nagalla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు