సినిమాల్లోకి రాకముందు డబ్బులకు ఆ పని చేశాడట.. ఎవరో తెలుసా?

సినిమాల్లోకి రాకముందు చాలా మంది ఎంతో కష్టపడినట్లు చెప్పుకుంటారు.తమ గతాన్ని తలుచుకుని చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతుంటారు.

ముఖ్యంగా హీరో, హీరోయిన్లు తమ బ్యాక్‌గ్రౌండ్‌ను గుర్తుకు చేసుకుని చాలా ఎమోషనల్ అవుతుంటారు.అయితే ఒక సెలెబ్రిటీ మాత్రం తన గతాన్ని తలుచుకుని నవ్వుకుంటున్నాడు.

ఇంతకీ ఆ సెలెబ్రిటీ ఎవరూ? ఆయన తన గతంలో ఏం చేశాడని ఇప్పుడు నవ్వుకుంటున్నాడని మీరు ఆలోచిస్తున్నారా? అయితే అసలు విషయం తెలుసుకుందాం పదండి.టాలీవుడ్‌లో స్టార్ లిరిసిస్ట్‌గా అనంత శ్రీరామ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

చాలా చక్కటి పదాలను పాటలుగా మలిచి వాటితో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ లిరిసిస్ట్ సినిమాల్లో అవకాశాలు రాకముందు ఏం చేశాడనే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.తన కాలేజీ రోజుల్లో తనతో పాటు చదువుకునే స్నేహితులకు ప్రేమలేఖలు రాసేవాడినని ఆయన అన్నారు.

Advertisement

తన ప్రేమ కవితలు అమ్మాయిలకు బాగా నచ్చేవని, అందుకే తన స్నేహితులు చాలా మంది తనవద్ద ఈ లేఖలు రాయించుకునేవారని తెలిపారు.అయితే తాను మాత్రం ఈ ప్రేమలేఖలను ఉచితంగా రాసేవాడు కాదట.ఒక్కో ప్రేమలేఖకు రూ.250 వరకు తీసుకునేవాడట.తన క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర రూ.125 తీసుకునేవాడినని, వారికి 50 శాతం డిస్కౌంట్ ఇచ్చేవాడినని అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.ఇలా తన కాలేజీ రోజుల్లో ప్రేమలేఖలు రాసి డబ్బులు సంపాదించానంటూ గుర్తుకు చేసుకుని నవ్వుకున్నారు అనంత శ్రీరామ్.

కాగా తాను ప్రేమలేఖలు రాసిన వారిలో కొందరు మాత్రమే పెళ్లి చేసుకోగలిగారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఏదేమైనా సినిమాల్లోకి రాకముందు ఇలా ప్రేమలేఖలు రాసిపెడుతూ ప్రేమికులను కలిపే పనిలో బిజీగా ఉండేవాడినని అనంత శ్రీరామ్ తెలియజేశాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు