ఆనందో బ్రహ్మ మూవీ రివ్యూ

చిత్రం : ఆనందో బ్రహ్మ
బ్యానర్ : 70 MM ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం : మహి వి రాఘవ
నిర్మాతలు : విజయ్ చిల్ల, శశిధర్ దేవిరెడ్డి
సంగీతం : కె
విడుదల తేది : ఆగష్టు 18, 2017
నటీనటులు : తాప్సి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ తదితరులు

 Anando Brahma Review-TeluguStop.com

కథలోకి వెళితే :


సిద్ధు (శ్రీనివాస్ రెడ్డి) ఒక బార్ లో పనిచేస్తుంటాడు.ఇతని గుండెకి రంధ్రం ఉంటుంది.

దానికి తాత్కాలిక చికిత్స భయమేస్తే నవ్వడం, నవ్వొస్తే బాధపడటం.శాశ్వత చికిత్స కావాలంటే పాతిక లక్షలు కావాలి.

సిద్ధుతో పాటు వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లకి కూడా వేరు వేరు కారణాలతో డబ్బు అత్యవసరం.అలాంటి సమయంలో వీళ్ళు ఓ దెయ్యాల కొంపలో మూడు రాత్రులు గడిపితే డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆ ఇంటి చుట్టు కోట్ల వ్యవహారం ఎందుకు నడుస్తోంది? ఈ కథలో తాప్సి ఎవరు? దెయ్యాలు ఉండే ఇంట్లో వీరు మూడు రాత్రులు గడిపగలిగారా లేదో సినిమాలోనే చూడండి.

నటీనటుల నటన :


ఈ కథలో కీలక పాత్రలు లేదా ముఖ్యమైన పాత్రలు శ్రీనివాస్ రెడ్డి, తాప్సిలవే కావచ్చు, కాని ఆడియెన్స్ వరకు హీరోగా నిలిచిపోయేది మాత్రం షకలక శంకర్‌.భీకర ఫామ్ లో ఉన్న వెన్నెల కిషోర్ ని, సీనియర్లు శ్రీనివాస్ రెడ్డి, రమేష్ లని డామినేట్ చేసాడు శంకర్.కేఏ పాల్ స్ఫూఫ్ ఎపిసోడ్ కి నవ్వుతూ నవ్వుతూ కింద పడినా పడతారు.

తాప్సి ఎమోషన్స్ ని బాగా పండించింది.భయపెట్టడం కూడా జరిగింది.

తెరపై అందంగా కూడా కనిపించింది.షకలక శంకర్ డామినేట్ చేసినా, ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర శ్రీనివాస్ రెడ్డిది‌.

గీతాంజలి తరువాత మరో హర్రర్ కామెడీ ని బాగా లాకొచ్చారు‌.సెలైంట్ కామెడితో వెన్నెల కిషోర్ బాగా నవ్వించాడు.

ఇక తాగుబోతు రమేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది.చాలాకాలం తరువాత కనిపించిన సీనియర్ నటుడు విజయ్ చందర్ బాగా బరువైన పాత్రను చాలా చక్కగా పోషించారు.రాజీవ్ కనకాల పెర్ఫార్మన్స్ కూడా ఆకట్టుకుంటుంది.

టెక్నికల్ టీమ్ :


సినిమాటోగ్రఫీ బాగుంది.90% సినిమా ఒకే ఇంట్లో నడిచిన సినిమా అపియరెన్స్ బోర్ కొట్టదు.బాగుంది.

ఉన్న రెండు బిట్ సాంగ్స్ సందర్భానుసారంగా ఉన్నాయి.బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది.

ఎడిటింగ్ ఫస్టాఫ్ కొంచెం బెటర్ గా ఉండాల్సింది.ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :


హర్రర్ కామెడీలు తెలుగులో కొత్త కాదు.ప్రేమకథాచిత్రమ్ నుంచి మొదలు, ఎన్నో హర్రర్ కామెడిలు వచ్చాయి‌.

ప్రేక్షకలకి ఈ జానర్ అంటే విరక్తి పుట్టేంత రోటీన్ అయిపోయాయి హర్రర్ కామెడీలు‌.కాని పాతబడిన జానర్ కే కొత్త రంగులు అద్దారు రాఘవ.

సినిమా మొదలైన పదిహేను నిమషాల్లోనే అర్థమయిపోతుంది, ఇది బోర్ కొట్టించే రొటీన్ హర్రర్ కామెడీ కాదని.ఎందుకంటే ఇక్కడ మనుషులను చూసే దెయ్యాలు భయపడతాయి.

ఈ వెరైటి థ్రెడ్ మీద వచ్చిన కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.అనవసరపు సీన్లు పెద్గగా లేవు.

సుధీర్ బాబు స్పెషల్ రోల్ సీన్ కూడా వృధాగా పోకుండా నవ్విస్తుంది.రోటిన్ గా దెయ్యాలు పగబట్టకుండా, వాళ్ళకి ఒక ఎమోషన్ బ్యాక్ డ్రాప్ ఇవ్వడం హైలేట్.క్లయిమాక్స్ కొద్దిగా డౌన్ అయినా, అప్పటిదాక నవ్వుకున్న ప్రేక్షకులు తృప్తిగానే హాల్ వీడుతారు‌.

ప్లస్ పాయింట్లు :


* కొత్తరకమైన కథ
* షకలక శంకర్
* ఎమోషన్స్
* దెయ్యాలే కలవరపడే సన్నివేశాలు

మైనస్ పాయింట్లు :

* క్లయిమాక్స్

చివరగా :

ఆనందంగా నవ్వుకోండి

రేటింగ్ :3.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube