శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనందికి బ్రేక్ ఇస్తుందా

పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో సుదీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ నడుస్తుంది.

 Anandi Waiting For Success With Sridevi Soda Center, Zombie Reddy, Tollywood, Ko-TeluguStop.com

గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు భాగా ఫేమస్ అయిన తిరనాళ్లు కాన్సెప్ట్ ని హైలైట్ చేస్తూ దర్శకుడు ఈ సినిమా కథని సిద్ధం చేసాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో సుదీర్ బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపిస్తున్నాడు.

తాజాగా రిలీజ్ అయిన హీరో క్యారెక్టర్ టీజర్ సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది.సుదీర్ బాబు మరోసారి సిక్స్ ప్యాక్ బాడీని సినిమాలో చూపిస్తున్నాడు.

ఇక రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కోసం హీరోయిన్ ఆనందిని దర్శకుడు ఎంపిక చేశాడు.

హాసినిగా తెలుగులో బస్టాప్ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన తెలుగు బ్యూటీ తరువాత ఆనందిగా పేరు మార్చుకొని కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుస అవకాశాలు అందుకొని సక్సెస్ అయ్యింది.తమిళ్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న ఆనంది జాంబీరెడ్డి సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో ఆమె హీరోతో లవ్ ట్రాక్ కంటే యాక్షన్ సీక్వెన్స్ బాగా పండించింది.ఇదిలా ఉంటే శ్రీదేవి సోడా సెంటర్ కోసం దర్శకుడు ఆమెని హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశాడు.

ఇక ఈ బ్యూటీ తెలుగులో చేస్తున్న కొద్దిగా పెద్ద ప్రాజెక్ట్ ఇదే అని చెప్పాలి.ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్ లో కూడా ఆనందికి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.

అయితే దర్శకుడు మాత్రం ఇప్పటి వరకు హీరోయిన్ లుక్ ని రివీల్ చేయకుండా సీక్రెట్ మెయింటేన్ చేస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube