జాంబీరెడ్డి నుంచి అసుర సంహారిణిగా హీరోయిన్ పాత్ర రివీల్  

Anandhi Looks Vicious In Zombie Reddy, Tollywood, Zombies, Telugu Cinema, Teja Sajja, Prasanth Varma - Telugu @anandhiactress, @appletreeoffl, @prasanthvarmafilm, @tejasajja123, Prasanth Varma, Teja Sajja, Telugu Cinema, Tollywood, Zombie Reddy, Zombies

మొదటి సినిమా “అ”తో క్రియేటివ్ ఐడియాలజీ ఉన్న దర్శకుడుగా టాలీవుడ్ తన మార్క్ చూపించుకున్న యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ.డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాని హీరో నాని నిర్మించాడు.

TeluguStop.com - Anandhi Looks Vicious In Zombie Reddy

ఈ సినిమా తర్వాత ఏకంగా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ని కల్కీ సినిమాతో తెరపై ఆవిష్కరించాడు.ఆ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది.

అయితే ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఎక్కువ మందిని మెప్పించలేకపోయాయి.అయితే దర్శకుడుగా అతని టాలెంట్ ని మాత్రం నిర్మాతలు గుర్తించారు.

TeluguStop.com - జాంబీరెడ్డి నుంచి అసుర సంహారిణిగా హీరోయిన్ పాత్ర రివీల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో మూడో సినిమాకి కూడా ప్రశాంత్ వర్మ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎంచుకున్నాడు.ఇప్పటి వరకు తెలుగు స్క్రీన్ పై రానటువంటి జాంబియన్స్ కాన్సెప్ట్ తో తెరపై ఆవిష్కరించబోతున్నాడు.

ఈ సినిమాకి టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా జాంబీరెడ్డి అని పెట్టాడు.
ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఉంది.

ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించి ఓ బేబీతో రీ ఎంట్రీ ఇచ్చి తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే సినిమాలో అతని క్యారెక్టర్ కి సంబందించిన లుక్స్ రివీల్ చేశారు.

ఇప్పుడు దసరా సందర్భంగా ప్రశాంత్ వర్మ టీం మరో పోస్టర్ ని రిలీజ్ చేసింది.కాళికాదేవి విగ్రహం వద్ద అసురసంహారిణీ రూపంలో హీరోయిన్ ఆనందిని అమ్మవారిగా త్రిశూలధారియై శత్రుసంహారానికి సిద్ధమవుతున్న ఉగ్ర రూపం ఆకట్టుకుంటోంది.

హీరోయిన్ బ్యాక్ డ్రాప్ లో కాళికాదేవిని కూడా భయంకరంగా ఆవిష్కరించారు.ఈ పోస్టర్ చూస్తూ ఉంటే కాస్తా పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో ప్రశాంత్ వర్మ ఈ సారి తెరపై ఆవిష్కరించాడని అర్ధమవుతుంది.

#@anandhiactress #Teja Sajja #Prasanth Varma #@AppleTreeOffl #@tejasajja123

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anandhi Looks Vicious In Zombie Reddy Related Telugu News,Photos/Pics,Images..