చైనాలో పుట్టిన మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది.తొలి దశలో దేశంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా.
రెండో దశలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది.అటు కరోనా కట్టడికి ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా.
సమర్థవంతంగా పనిచేసినట్లు కనిపించడం లేదు.చాలా మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు.
అయితే తాజాగా కరోనాను చంపేందుకు ఆయుర్వేదం బాగా పనిచేస్తుందని నిరూపించారు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య.ఆయన ఇచ్చే ఔషధం వ్యక్తులపై బాగా పనిచేస్తోంది.
దీంతో ఆనందయ్య మందును పంపిణీ చేయడానికి ప్రభుత్వం కూడా సరే చెప్పినట్లు తెలిసింది.దీంతో ఒక్కరోజులోనే అది కాస్త ఆగిపోయింది.
ఆనందయ్య మందుపై సానుకూలతతో పాటు వ్యతిరేకత మొదలైంది.దీంతో ఆ పరిశోధన, ఈ పరిశోధన అంటూ ప్రస్తుతానికి మందు పంపిణీ ఆగిపోయింది.
అయితే ఫార్మా కంపెనీల కుమ్మక్కుతోనే ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.
అయితే ఆనందయ్య వాడుతున్న 18 రకాల మూలికలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? అసలు కరోనాకు ఔషధాన్ని ఆనందయ్య ఎలా కనిపెట్టగలిగాడన్నదే ఇప్పుడు సర్వత్రా తలెత్తుతున్న ప్రశ్నలు.ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రస్తుతం ఆనందయ్య ఉపయోగిస్తున్న మూలికలు, వాటి వివరాలు 159 యేళ్ళ చరిత్ర కలిగిన పుస్తకాల్లో లిఖించబడి ఉండటం విశేషం.ఈ విషయం కాస్తా ఈ మధ్యనే మధ్యనే బయటపడింది.
సోషల్ మీడియాలో నాటి గ్రంథప్రతి వైరల్ గా మారింది.
జిల్లేడు పువ్వు మొగ్గలు, మిరియాలు, పచ్చ కర్పూరం, మరువము ఇలా మొత్తం 18 రకాల మూలికల వివరాలు అందులో స్పష్టంగా రాసి ఉన్నాయి.
అసలు ఇది ఎలా పనిచేస్తుందన్న విషయం కూడా ఆ పుస్తకంలో రాసి ఉంది.కరోనా వస్తుందని మందుగానే ఊహించి ఈ పుస్తకంలో రాశారేమోనని భావిస్తున్నారు.ఆ పుస్తకంలో ఉన్నట్లుగానే ఆనందయ్య మొత్తం మూలికలను ఉపయోగించి ఈ ఔషధాన్ని తయారుచేస్తున్నారట.అయితే ఈ ఔషధంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.ఆనందయ్య మందు కొనసాగాలా? వద్దా? అనేది త్వరలో తేలిపోనుంది
.