మరోసారి మరో వీడియో తో ఆనంద్ మహేంద్ర  

Ananda Mahendra Shares Boy Video Goes Viral-

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.ఆయన ఒక బిజినెస్ మ్యాన్ గా ఎంత సుపరిచితులో అలానే సోషల్ మీడియా లో కూడా మంచి యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.ఇటీవల వంట గదిలో సాయం కోరిన తన భార్యకు పంపిన ఫోటో ని చూసి చాలా మంది నెటిజన్లు లైక్ లు,షేర్ లు చేసిన సంగతి విదితమే...

Ananda Mahendra Shares Boy Video Goes Viral--Ananda Mahendra Shares Boy Video Goes Viral-

అయితే ఇప్పుడు తాజాగా మరో వీడియో ఒకటి షేర్ చేశారు.ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారా.ఆ వీడియో లో ఒక బుడ్డోడు సెలూన్ లో తల్లి ఒడిలో కూర్చొని ట్రిమ్మింగ్ చేయించుకుంటున్నాడు.

అయితే ట్రిమ్మింగ్ చేస్తున్న సమయంలో ఆ బుడ్డోడు నవ్వుతున్న తీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా నవ్వు ఆపుకోలేరు.ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు విపరీతంగా బోసినవ్వుల్ నవ్వుతూ,కాళ్ల ను సైతం ఊపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.ఎవరైనా పిల్లలు సెలూన్ కి తీసుకెళితే ఏ రేంజ్ లో ఏడుస్తారో అందరికీ తెలిసిందే.

Ananda Mahendra Shares Boy Video Goes Viral--Ananda Mahendra Shares Boy Video Goes Viral-

కానీ ఈ బుడ్డోడు మాత్రం ఏడుపు మాట పక్కన పెడితే బోసినవ్వులు నవ్వుకుంటూ అందరిని నవ్విస్తున్నాడు.ఇక ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.ఎప్పుడైనా నిన్ను బాధపడ్డే సందర్భాలు ఎదురైనప్పుడు లేదా చదివినప్పుడు.ఈ వీడియో కచ్చితంగా మీ పెదాలపై నవ్వును తీసుకొస్తుంది.

ఆ తరువాత ప్రపంచమంతా నీకు మామూలుగా కనిపిస్తుంది.లేకపోతే నేను నా మనవడిని మిస్ అవుతున్నానేమో అంటూ కామెంట్ పెట్టాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుండగా, నెటిజన్లు వావ్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.