తల్లితో టూరు.. బహుమతిగా కారు అంటోన్న వ్యాపార దిగ్గజం  

Anand Mahindra Wanted To Gift Car To Man Who Took Mother On Tour - Telugu Anand Mahindra, Indian News, Indian Tour, Mother, Mother Love, Mysore Man

తనను నవమాసాలు కనిపెంచిన తల్లి ఆ కొడుకును ఎప్పుడు ఎలాంటి కోరిక కోరలేదు.ఏకంగా 70 ఏళ్ల వయసులో తనను బయటకు తీసుకెళ్లవా అని ఆ తల్లి అడిగిన తీరుతో ఒక్కసారిగా ఆ కొడుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది.

Anand Mahindra Wanted To Gift Car To Man Who Took Mother On Tour

ఇంతకీ ఆ తల్లి కోరిన కోరికను తీర్చేందుకు ఆ కొడుకు ఏం చేశాడనేగా మీ ప్రశ్న.అయితే మనమూ తెలుసుకుందాం పదండి.

కర్ణాటకలోని మైసూరుకు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్ ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి.తన 70 ఏళ్ల తల్లి ఎన్నడూ కనీసం బటయ ఊరికి వెళ్లింది లేదు.

తల్లితో టూరు.. బహుమతిగా కారు అంటోన్న వ్యాపార దిగ్గజం-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ మధ్యన ఓ సందర్భంలో తనను బయటకు తీసుకెళ్లమని ఆ తల్లి దక్షణామూర్తిని కోరింది.దీంతో తన తల్లి కోరికను కాదనలేకపోయాడు ఆ కొడుకు.ఆమె కోరిక తీర్చేందుకు ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు.ఇలా అని ఏదో చుట్టుపక్కల ఉన్న ఊళ్లు తిప్పలేదు.

ఏకంగా ఆమెకు బాహ్యప్రపంచం ఎలా ఉందో చూపించేందుకు ‘మాతృసేవా సంకల్ప యాత్ర’ అనే యాత్రను మొదలుపెట్టాడు.దీని కోసం 20 ఏళ్ల కిందట తన తండ్రి ఉపయోగించిన స్కూటరు మీద ఏకంగా 18 రాష్ట్రాలు, మూడు దేశాలు తిప్పి చూపించాడు.

కేరళలో 2018 జనవరి 18న ఆయన ప్రారంభించిన మాతృ సంకల్ప యాత్ర 48,100 కిమీ పూర్తి చేసుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగింది.ఈ ప్రయాణంలో తన తల్లిని కేవలం దేశంలోని ప్రాంతాలే కాకుండా సరిహద్దు దేశాలైనా భూటాన్, నేపాల్, మయన్మార్ లాంటి ప్రదేశాల్లో సుప్రసిద్ధ దేవాలయాలన్నింటినీ చూపించాడు.దక్షిణామూర్తి తన తల్లి కోరికను తీర్చేందుకు చేసిన సాహోసేపతమైన ప్రయత్నాన్ని ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర మనోజ్ అనే వ్యక్తి ద్వారా తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇలాంటి తల్లి రుణం తీర్చుకునేందుకు దక్షిణామూర్తి చేపట్టిన యాత్ర చాలా గొప్పదని.

ఇందులో కేవలం మాతృప్రేమ మాత్రమే కాకుండా దేశభక్తి కూడా కనబడుతుందని అన్నారు.దక్షిణామూర్తిని తనకు పరిచయం చేస్తే ఓ ఎస్‌యూవీ కారు బహుమతిగా ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.

తద్వారా వారి యాత్రను ఆ కారులో కొనసాగించుకోవచ్చని ఆనంద్ మహీంద్రా అన్నారు.

తాజా వార్తలు

Anand Mahindra Wanted To Gift Car To Man Who Took Mother On Tour-indian News,indian Tour,mother,mother Love,mysore Man Related....