ఇండియన్ ఉసేన్ బోల్డ్ కి అరుదైన అవకాశం... ఆ ట్వీట్ పై కేంద్ర మంత్రి స్పందన  

Anand Mahindra Tweet On Karnataka Man Srinivas Goud - Telugu Anand Mahindra Tweet, Indian Sprinter, Karnataka Man Srinivas Goud, Usain Bolts

ప్రపంచంలో మేటి రన్నర్ గా గుర్తింపు తెచ్చుకున్న జమైకా కింగ్ ఉసేన్ బోల్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తి స్ప్రిన్తర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతని వేగాన్ని ఇంకెవరు అందుకోలేరని అందరూ భావించారు.

Anand Mahindra Tweet On Karnataka Man Srinivas Goud

అయితే ఇప్పుడు అతని వేగాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా ప్రపంచ రికార్డ్ ని బ్రేక్ చేసిన కర్నాటకకి చెందిన శ్రీవాస గౌడ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది.ఇండియాలో ఉన్న ఇలాంటి మట్టిలో మాణిక్యాలని సాన పెడితే ఒలింపిక్స్ లో ఇండియాని ఎవరు ఆపలేరని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకోవడం విశేషం.

ఇండియాలో టన్నుల కొద్ది టాలెంట్ ఉన్న ఆటలలో కూడా రాజకీయాలు ఉండటం వలన ఎంతో మంది వెలుగులోకి రాలేకపోతున్నారు.

కన్నడ యువకుడు శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తి చేశాడు.ఈ స్పీడ్‌ చూసి అంతా థ్రిల్ అయిపోయారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా కూడా శ్రీనివాస గౌడపై వేగాన్ని చూసి ఆశ్చర్యపోయారు.ప్రభుత్వం శ్రీనివాసగౌడకు శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్‌కు పంపించాలని ట్వీట్ చేశారు.

ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజీజు దృష్టికి తీసుకెళ్లారు.శ్రీనివాసగౌడ శారీరక దారుఢ్యాన్ని చూడాలని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.100 మీటర్ల స్ప్రింట్‌లో శిక్షణ ఇప్పించాలని అభిప్రాయపడ్డారు.ఈ ట్వీట్ కి కిరణ్ రిజీజు పాజిటివ్‌గా స్పందించారు.

శ్రీనివాస్‌ను శాయ్‌కు పిలిపిస్తామని హామీ ఇచ్చారు.ట్రయల్స్ కోసం కోచ్‌ల వద్దకు పంపిస్తామని చెప్పారు.

ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టం చేశారు.ఆనంద్ మహేంద్రా ట్వీట్ తో ఈ పరుగుల వీరుడు మరింత ఫేమస్ అయిపోయాడు.

అయితే క్రీడా మంత్రిత్వ శాఖ అతనిని ఎంత వరకు ఉపయోగించుకొని అతని ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు

Anand Mahindra Tweet On Karnataka Man Srinivas Goud-indian Sprinter,karnataka Man Srinivas Goud,usain Bolts Related Telugu News,Photos/Pics,Images..