టీకొట్టు వ్యక్తికి అశ్రునివాళి అర్పించిన ఆనంద్ మహీంద్రా.. అతను ఎవరో తెలిస్తే!

జీవితం అంటేనే ఒక ప్రయాణం అని చాలా మంది తత్వవేత్తలు చెబుతుంటారు.చనిపోయేలోగా జీవితాన్ని ఒక మధురమైన ప్రయాణంలా మలచుకోవాలని అనుకునే వారు ఎందరో.

 Anand Mahindra Shed Tears For Tea Shop Man ..if He Knows Anyone ,anand Mahindra,-TeluguStop.com

కానీ కుటుంబ బరువు బాధ్యతలు వల్ల పుట్టామా.చనిపోయావా అన్నట్టే చాలా మంచి జీవితాలు కొనసాగుతున్నాయి.

అయితే కేరళకు చెందిన కేఆర్‌ విజయన్‌, మోహన దంపతులు వయసు పైబడినా సరే తమ జీవితాలను రంగులమయం చేయాలనుకున్నారు.కుటుంబ బాధ్యతలు నెరవేర్చి ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన తర్వాత వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచ యాత్రలకు బయల్దేరారు.

వృద్ధ వయస్సులోనూ ఇంటిని వదిలి ప్రపంచంలో అడుగుపెట్టి మొత్తం 26 దేశాలు చుట్టొచ్చారు.ప్రపంచ అందాలను, రకరకాల ప్రజలను కలిసి మర్చిపోలేని జ్ఞాపకాలను ఏర్పరుచుకున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.వారేమీ స్వతహాగా కోటీశ్వరులు కాదు.

వారు కేరళలోని కోచిలో ఓ చిన్న టీకొట్టు నడుపుతుంటారు.ట్రావ్లింగ్ కి అవసరమైన డబ్బును బ్యాంకులో రుణం తీసుకొని.

మళ్లీ టీ కొట్టు ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పు తీర్చేవారు.

బరువు బాధ్యతలను భుజస్కంధాలపై నుంచి దించుకున్న తర్వాత వీరు 50 ఏళ్ల వయసులో ఏకంగా 26 దేశాల్లో ట్రావెలింగ్ చేస్తూ తమ లైఫ్‌ని గడిపారు.

రెండేళ్ల క్రితం ఈ దంపతులు గురించి మీడియా ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది.దాంతో వీరిని చూసి ఎందరో ప్రేరణ పొందారు.పేదరికం, ముసలితనం ఇలా ఏవైనా సరే మన కలల సాకారానికి అడ్డురావని నిరూపించి చూపించారు.ఈ దంపతుల గురించి తెలుసుకున్న ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం అభిమాని అయిపోయారు.

అయితే దురదృష్టవశాత్తు ఆ వృద్ధ దంపతుల్లో ఒకరైన విజయన్‌ తాజాగా కన్నుమూశారు.71 ఏళ్ల వయసులో గుండెపోటు రావడంతో ఆయన శుక్రవారంనాడు తుది శ్వాస విడిచారు.ఎర్నాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విజయన్‌ మరణించారని తెలిసి ఆనంద్‌ మహీంద్రా దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆయన మనందరిలోని అన్వేషకుడు అయ్యారని ఆనంద్‌ మహీంద్రా ఎమోషన్ అయ్యారు.అశ్రు నివాళి అర్పిస్తూ విజయం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube