హనీమూన్‌లో ఎంజాయ్ చేస్తూ ఆ పని చేస్తున్న ఆనంద్ మహీంద్రా..?!

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియాలో వినూత్న ఆవిష్కరణలు, ఆసక్తికర వీడియోలను పంచుకుంటూ ఉంటారు.

అలాగే తనకు సంబంధించిన ఫొటోలకు కూడా షేర్ చేస్తూ ఉంటారు.అందులో భాగంగా తాజాగా ఒక ఫొటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.

ఈ ఫొటోలో ఆనంద్ మహీంద్రా చెస్ ఆడుతూ కనిపించారు.

ఇంటర్నేషనల్ చెస్ డే( International Chess Day ) సందర్భంగా చెస్ ఆడుతున్న ఫొటోలను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.దీంతో ఈ ఫొటో ఇప్పటిది అని అందరూ అనుకున్నారు.కానీ ఆనంద్ మహీంద్రా తర్వాత అసలు విషయం చెప్పారు.

Advertisement

ఇది ఇప్పటి ఫొటో కాదని, తన హనీమూన్( Anand Mahindra Honeymoon Photo ) నాటి ఫొటో అని చెప్పుకొచ్చారు.హనీమూన్ కి వెళ్లినప్పుడు ఆగ్రాలో ఈ ఫొటో తీయించుకున్నట్లు చెప్పారు.

అంతేకాకుండా తాను ఫొటోలో చూపించినట్లు చెస్ ఆడలేదని, జస్ట్ ఫొటో కోసం అలా ఫోజులు ఇచ్చినట్లు ఆనంద్ మహీంద్రా చెప్పారు.

ఈ ఫొటోలో ఆనంద్ మహీంద్రా నిజంగా చెస్ ఆడుతున్నట్లు సీరియస్ గా కనిపించారు.ఏదో ఆలోచిస్తున్నట్లు ఫోజులిచ్చారు.ఎదురుగా మాత్రం మనిషి ఎవరూ లేరు.

దీంతో ఫొటోకు ఫోజులివ్వడం కోసమే ఇలా చెస్ ఆడినట్లు అర్థమవుతుంది.ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్( Anand Mahindra Twitter ) లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కొంతమంది ఫొటోలో చాలా బాగున్నారని కితాబిస్తున్నారు.

Advertisement

అప్పట్లో స్లిమ్ గా బాగున్నారని కామెంట్ చేస్తున్నారు.పెళ్లప్పుడు చాలా అందంగా, జెంటిల్‌మెన్ లా ఉన్నారని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అప్పట్లో మీ అందానికి సీక్రెట్ ఏంటి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

దీంతో ఆయన ఫొటో సోషల్ మీడియా( Social Media )లో చక్కర్లు కొడుతుంది.

తాజా వార్తలు