లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన అనుమతి దొరకలేదు... రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారా అయితే ఈ మధ్యకాలంలో రాజమౌళి సినిమాలు కాస్త భిన్నంగా ఉంటాయని చెప్పాలి.తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) స్వాతంత్ర ఉద్యమంలో కలవని ఇద్దరు యోధుల గురించి సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

 Anand Mahindra Requests Ss Rajamouli To Make A Film On Indus Valley Civilization-TeluguStop.com

అయితే ఇలా విభిన్న చిత్రాలను చేసే రాజమౌళికి ఆనంద్ మహేంద్ర( Anand Mahindra ) ఓ సలహా ఇచ్చారు.

పురాతన నాగరికతలైన సింధు, హరప్పా, మొహంజాదారో వంటి వాటిపై సినిమాలు చేయండి అంటూ ఆనంద మహేంద్ర రాజమౌళికి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.ఇలా ఆనంద్ మహేంద్ర చేసినటువంటి ట్వీట్ పై రాజమౌళి స్పందిస్తూ… తాను మగధీర సినిమా( Magadheera ) ను దోలావీరలో చేస్తున్న సమయంలో ఓ పురాతన చెట్టు కనిపించింది అది శిలాజంగా మారింది.అయితే సింధు నాగరికత( Indus Valley Civilisation )ను ఆ చెట్టు ద్వారా వివరిస్తూ ఓ సినిమా చేయాలని అనుకున్నాను.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పాకిస్తాన్( Pakistan ) వెళ్లాను.

అక్కడ మొహంజాదారో( Mohenjo Daro ) చూడటం కోసం ప్రయత్నించాను అయితే అనుమతి లేదంటూ లోపలికి తనను పంపించడం లేదని ఈ సందర్భంగా రాజమౌళి ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతుంది.టెక్ దిగ్గజంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇక సినిమాల పరంగా ఈయన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు.

ఇకపోతే ఆనంద్ మహేంద్ర ప్రభాస్ హీరోగా వస్తున్నటువంటి ప్రాజెక్టుకే సినిమాకు భారీగా సహాయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube