ఇండియాతో పందెమా? గ్లోబల్ మీడియాను హెచ్చరించిన ఆనంద్ మహీంద్రా?

ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు.మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా వుంటారనే విషయం అందరికీ తెలిసినదే.

 Anand Mahindra Message To Global Media Amid Adani Hindenburg Controversy Details-TeluguStop.com

ఆయన సమకాలిన అంశాలపై ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ స్పందిస్తుంటారు.ఈ మీడియం ద్వారా నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు.

అతని దినచర్యలో ఓ ముఖ్య భాగం ఇది.ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించడం జరిగింది.

ఈ సందర్భంగా భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు? అని పాశ్చాత్య మీడియాకు కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.ఇటీవల హిండెన్ బర్గ్ విడుదల చేసిన రిపోర్టులతో అదానీ షేర్లు భారీగా పడిపోతున్నాయి.అయితే ఇది కావాలనే కొన్ని భారత వ్యతిరేక శక్తులు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా వున్నాయి.భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు, BJP వ్యతిరేక శక్తులు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని BJP సైద్ధాంతిక సంస్థ RSS తన ఆర్గనైజర్ పత్రికలో విమర్శించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా “వ్యాపారం రంగంలో ప్రస్తుత సవాళ్లు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే భారత ఆశయాలను దెబ్బ తీయొచ్చని గ్లోబల్ మీడియా ఆశపడుతోంది.అయితే మేము భూకంపాలను, కరువులను, మాంద్యం, యుద్ధం, తీవ్రవాద దాడులను ఎదుర్కొని జీవించిన వాళ్ళము.నేను చెప్పేది ఒక్కటే, భారత్ కు వ్యతిరేకంగా ఎప్పుడు పందెం కాయొద్దు?” అని ఆయన తన ట్వీట్ లో గ్లోబల్ మీడియాను ఘాటుగానే హెచ్చరించారు.ఇకపోతే ప్రపంచంలోనే శరవేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది భారత్.

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో 5వ స్థానంలోకి చేరుకుంది.రానున్న కాలంలో మరింత పురోగమించాలని అనుకుంటున్న తరుణంలో అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube