వైర‌ల్‌.. ఈ చిన్నారి ప‌నికి ఫిదా అయిపోయిన ఆనంద్ మ‌హీంద్రా..

ఆనంద్ మహీంద్రా. ఈయన గురించి ఇండియాలో తెలియని వారు ఉండరు.

 Anand Mahindra Mesmerizes With The Work Done By Child Mali-TeluguStop.com

మహేంద్ర పేరుతో ఉన్న అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ఆయనే అధిపతి అని అందరికీ తెలుసు.కానీ ఈయన సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారని మీకు తెలుసా.

ఎప్పుడో ఏదో ఒక విషయాన్ని నెటిజన్లకు పరిచయం చేస్తుంటారు.కొత్త విషయాలను, వ్యక్తుల గురించి చర్చ సాగిస్తుంటారు.

 Anand Mahindra Mesmerizes With The Work Done By Child Mali-వైర‌ల్‌.. ఈ చిన్నారి ప‌నికి ఫిదా అయిపోయిన ఆనంద్ మ‌హీంద్రా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆనంద్ మహీంద్రా ఓ వైపు బిజీగా ఉంటూనే కొంచెం ఖాళీ సమయం దొరికినా ఇలాంటి సందేశాత్మక మెసేజ్‌లను నేటి యువతరంతో పంచుకుంటుంటారు.ఈయన పెట్టే పోస్టులకు కూడా నెటిజన్లు తమదైన శైలితో స్పందిస్తుంటారు.

తాజాగా ఆయన ఓ చిన్నారిని తెగ మెచ్చుకున్నారు.అంతేకాకుండా ఆ పాటలు అన్నీ తన తరం నాటివని రాసుకొచ్చారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ది కాబ్స్‌ ఫ్యామిలీ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఓ వీడియోలో ‘మాలి’ అనే చిన్నారి తన తండ్రితో కలిసి కారులో కూర్చుంటుంది.

వీరిద్దరూ ఎక్కడికో ప్రయాణం చేసేందుకు వెళుతుంటారు.అయితే, తన తండ్రి కారు డ్రైవ్‌ చేస్తుండగా.మాలి కూనిరాగాలు తీస్తుంటుంది.అతనితో మాట్లాడుతూనే సాంగ్స్ పెట్టాలని కోరుతుంది.

అందులోనూ జేమ్స్‌ బ్రౌన్‌, మైఖేల్‌ జాక్సన్‌ వంటి ప్రముఖుల అల్బమ్స్ ప్లే చేయాలని తన తండ్రిని అడుగుతుంది.

కూతురి కోరిక ప్రకారం తండ్రి అవే పాటలు పెడుతాడు.సాంగ్స్ రావడం ప్రారంభం కాగానే మాలి కూడా ఆ పాటకు గొంతు కలుపుతుంది.తనదైన ముఖకవలికలతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది.

సీటులో కూర్చుని లైట్‌గా డ్యాన్స్‌ కూడా చేస్తుంది.చిన్నారి మాలి ఎక్స్‌ప్రెషన్లు చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.

అంతేకాకుండా సాంగ్స్ లిరిక్స్‌ను ఉన్నది ఉన్నట్టు దింపేస్తుంది.ఆనంద్‌ మహీంద్రా ఈ పాపను చూసి టాలెంట్ చూసి ఫిదా అయ్యారట.

అందుకే ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్టు చేస్తూ.మోస్ట్‌ ఎంటర్‌టైనర్ వీడియో ఇదని.

హే మాలి.మ్యాజిక్‌లో నీకు మంచి పట్టుంది అంటూ రాసుకొచ్చారు.

నువ్వు ప్లే చేయాలని అడిగిన పాటలన్నీ నా తరం నాటివి’ అని చెప్పుకొచ్చారు.ఈ వీడియోను మీరు కూడా ఎంజాయ్ చేయండి.

#Mali #Anand Mahindra #Michael Jackson #James Brown #Cute

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube