సోషల్ మీడియాలో వైరలైన దిండ్ల పిల్లోడు,మహింద్రాలో జాబ్ కొట్టేశాడు  

Anand Mahindra Latest Tweet Goes Viral Little Genius Kid-

మంచంపైన ఆడుకుంటున్న పిల్లాడు కిందికి దిగాలనుకున్నాడు.కాని కిందికి దిగలేక దిగితే పడిపోతానని ..

Anand Mahindra Latest Tweet Goes Viral Little Genius Kid--Anand Mahindra Latest Tweet Goes Viral Little Genius Kid-

మంచంపై ఉన్న దిండ్లను ఒక్కోటి కింద పడేసి.ఎంచక్కా ఆ దిండ్లపైకి దిగి పోయాడు.ఆ పిల్లాడి వయసు నిండా ఏడాది నిండి ఉండదు.

ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది.ఇప్పుడు అదే వీడియో మహింద్రా కంపెని అధినేత ఆనంద్ మహింద్రా కంటపడింది.

వెంటనే ఆ పిల్లాడికి ఉద్యోగం ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు ఆనంద్ మహింద్రా.

ఏడాది నిండని పిల్లాడు ఏం ఉద్యోగం చేస్తాడు అని ఆశ్చర్యపోతున్నారా?బెడ్ దిగడానికి దిండ్లును కిందపడేసి సేఫ్‌గా లాండ్ కావడం చూసిన నెటిజన్లు వాడి తెలివిని వాట్ ఏ జీనియస్ అంటూ పొగిడేసారు.చాలా షార్ప్ పిలగాడు అంటూన కితాబులిచ్చేశారు.ఇటీవల ఈ వీడియో చూసిన ఆనంద్ మహింద్రా వాడి టాలెంట్‌కు ఫిదా అయిపోయి జాబ్ ఇస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పుడే కాదులెండి.

బుడ్డోడు కాలేజీ చదువు పూర్తిచేసుకున్న తర్వాత.‘ఓకే..

ఈ చిన్నోడు కాలేజీ పూర్తి చేసుకున్నాక కాంట్రాక్టు కుదుర్చుకుంటాను.వీడు మేం చేపట్టే ప్రాజెక్టులన్నీ సులువుగా ల్యాండ్ అయ్యేలా చూస్తాడు.వాట్ ఏ లిటిల్ జీనియస్.’ అని ట్వీట్ చేశాడు ఆనంద్.

ప్రతిభ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వాటంతట అవే వస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ.చూడాలి పెద్దయ్యాక మహింద్రాలో ఉద్యోగం చేస్తాడో అంతకంటే పదింతలు ఎక్కువ ఎదుగుతాడో.