భావోద్వేగంతో చిన్నారి వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర  

Anand Mahindra Moved By Differently Abled Toddler - Telugu Anand Mahindra, Anand Mahindra Shares Heart Warming Video Of Disabled Kid, Funny Tweet, Video Hul Chal In Social Media

ఎప్పుడూ కూడా సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర.ఎప్పుడూ కూడా సరదా ట్వీట్స్ తో నవ్వులు పూయించే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో ని షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Anand Mahindra Moved By Differently Abled Toddler

ఇంతకీ ఆ వీడియో లో ఏమి ఉందంటే.ఒక చిన్నారి చేతుల్లేని కారణంగా కాళ్ల తోనే ఫోర్క్ పట్టుకొని ఆహారం తినేందుకు ప్రయత్నిస్తున్న వీడియో అది.ఆ వీడియో ని పోస్ట్ చేసిన ఆయన ఈ వీడియో చూస్తే ఎందుకో నా కళ్ల లో నీళ్లు ఆపుకోలేకపోయాను అంటూ ట్వీట్ చేసారు.‘‘నా మనవడి వీడియోను ఇటీవలే చూశాను.

కానీ, వాట్సాప్‌లోని ఈ వీడియోను చూసి నా కళ్లల్లో నీళ్లు ఎందుకు ఆపుకోలేకపోయానో తెలియడం లేదు.జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతాయి.

భావోద్వేగంతో చిన్నారి వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర-General-Telugu-Telugu Tollywood Photo Image

వాటిని మనం బహుమతిగా భావించి.అనుకూలంగా మలచుకోవడమే ముఖ్యం.

ఇలాంటివి చూస్తున్నప్పుడు నాలో ధైర్యం రెట్టింపు అవుతుంది’’ అని అంటూ మహీంద్ర ట్వీటర్ లో పోస్ట్ చేసారు.ఇంతకీ ఆ వీడియో లో ఉన్న చిన్నారి పుట్టుకతోనే చేతులు కోల్పోయింది.

దీంతో ఆమె తన కాళ్లతోనే ఆహారం తినడానికి ప్రయత్నిస్తుంది.ఆ వీడియో చూసిన మహీంద్ర కు కన్నీళ్లు ఆగలేదట.

అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు కూడా తీవ్ర బావోద్వేగానికి గురవుతూ రీట్వీట్ చేస్తున్నారు.

నిజంగా దేవుడు ఏదైనా లోపం ఇస్తే దానికి బదులుగా వారిలో ఆత్మస్థైర్యాన్ని రెంట్టింపు గా అందిస్తారు అని అంటూ ఉంటారు.నిజంగా ఇలాంటి వీడియో లు చూసినప్పుడు ఆ మాటలు నిజమే అని అనిపిస్తుంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anand Mahindra Moved By Differently Abled Toddler-anand Mahindra Shares Heart Warming Video Of Disabled Kid,funny Tweet,video Hul Chal In Social Media Related....