‘సింధు’కు ఆనంద్ మహీంద్రా గిఫ్ట్.. ఆ వాహనంపైనే విజయయాత్ర..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆల్వేస్ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.ఒక రకంగా సోషల్ మీడయా గురు ఆనంద్ మహీంద్రా అని ఆయన్ను మనం పొగడొచ్చు.

 Anand Mahindra Funny Reply To Netizen Who Asked Thar Vehicle Gift To Pv Sindhu-TeluguStop.com

తాజాగా ఆయన పీవీ సింధు కాంస్య పతకం సాధించిన సందర్భంగా అభినందనలు తెలుపగా, ఆ క్రమంలో ఆసక్తికర సంభాషణ జరిగింది.నెటిజన్లు, సింధుకు బహుమతిగా ఏదైనా గిఫ్ట్ ఇస్తారేమో అని అనుకుంటున్న క్రమంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫన్నీ రిప్లయి ఇచ్చాడు.

ఇంతకీ ఆ రిప్లయి ఏంటి? సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రావి ఏ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి? తెలియాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

 Anand Mahindra Funny Reply To Netizen Who Asked Thar Vehicle Gift To Pv Sindhu-‘సింధు’కు ఆనంద్ మహీంద్రా గిఫ్ట్.. ఆ వాహనంపైనే విజయయాత్ర..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు తేజం పీవీ సింధు చైనా ప్లేయర్ చేతిలో పోరాడి ఓడగా, తాజాగా కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

వరుసగా రెండోసారి ఒలింపిక్‌ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది పీవీ సింధు.ఈ క్రమంలో ఆమెకు ప్రముఖులు, నేతల నుంచి మొదలకుని సామాన్యుల వరకు ప్రశంసలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర పీవీ సింధును అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.పీవీ సింధు బంగారు తల్లి అని క్యాప్షన్‌తో కూడిన పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంలో ఓ ఫన్నీ నెటిజన్‌ చేసిన కామెంట్‌, సదరు కామెంట్‌కు ఆనంద్ మహింద్ర రిప్లయ్‌ ఇవ్వడం మొత్తంగా సోషల్ మీడియాలో వీరి కన్వర్జేషన్ వైరల్‌గా మారింది.

ట్విట్టర్ యూజర్ శుభ్‌ వదేవాల ‘సింధు అత్యుత్తమ ప్రదర్శనకుగాను మహేంధ్ర వెహికల్ ‘థార్‌’గిఫ్ట్ అని ప్రకటించారు.దీనిని ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేశాడు.ఈ క్రమంలోనే ‘వాంట్ థార్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ క్రియేట్‌ చేశారు.

ఈ పోస్టును చూసిన ఆనంద్‌ మహీంద్రా రిప్లయ్‌ ఇచ్చాడు.సింధుకు ఆల్రెడీ థార్ వెహికల్ ఉందని పేర్కొంటూ, అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.

సాక్షిమాలిక్‌తో సింధు థార్ వెహికల్‌పై ఉన్న ఆ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రియో ఒలింపిక్స్‌లో సింధు విజయం సందర్భంగా ఆమెకు ‘థార్’ వెహికల్ ఇచ్చినట్లు గుర్తుచేశాడు ఆనంద్ మహీంద్రా.

#Anand Mahindra #Gift Pv Sindhu #Reply #Tokyo Loym #PV Sindhu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు