జూనియర్ రౌడీ స్టార్‌ కరోనా టైమ్‌ లోనే రెండు సినిమాలు

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా వరుసగా సినిమా లు చేస్తున్నాడు.ఆయన తమ్ముడు దొరసాని సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

 Anand Devarakonda Third Film Also Done In Corona Time-TeluguStop.com

ఆ సినిమా తో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా పరిచయం అయ్యింది.అంచనాలను దొరసాని అందుకోవడంలో విఫలం అయ్యింది.

దొరసాని సినిమా కు సంబంధించిన ఫలితంతో సంబంధం లేకుండా ఆనంద్ దేవరకొండ వరుసగా సినిమా లు చేసుకుంటూ వెళ్తున్నాడు.తన అన్న కు ఉన్న స్టార్‌ డమ్‌ నేపథ్యంలో ఆనంద్‌ దేవరకొండకు అవకాశాలు కొట్టుకు వస్తున్నాయి.

 Anand Devarakonda Third Film Also Done In Corona Time-జూనియర్ రౌడీ స్టార్‌ కరోనా టైమ్‌ లోనే రెండు సినిమాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా మొదలు అయిన తర్వాతే ఈయన రెండు సినిమా లు మొదలు పెట్టాడు పూర్తి కూడా చేశాడు.ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ను ఓటీటీ ద్వారా విడుదల చేశారు.

ఇక ఈయన మూడవ సినిమా పుష్పక విమానం.ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్‌ లుక్ వచ్చేసింది.

షూటింగ్‌ ముగించి విడుదలకు సిద్దం అయిన నేపథ్యం లో సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు.

సమంత చేతుల మీదుగా ఈ నెల 18వ తారీకున మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఆనంద్‌ దేవరకొండ సినిమా వివాహ భోజనంబు షూటింగ్‌ ముగించిన నేపథ్యంలో ఈసారి కూడా ఓటీటీ విడుదల అయ్యి ఉంటుందా అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Telugu Anand Devarakonda, Film News, Middle Class Melodies, Pushpaka Vimanam, Samantha, Vijay Devara Konda, Vivaha Bhojanambu-Movie

మొత్తానికి విజయ్‌ దేవరకొండ నుండి ఇప్పటికే తమ్ముడికి ఫుల్‌ గా మద్దతు ఉంది.ఈ సినిమా కూడా ఆయన మద్దతు ఉంటే తప్పకుండా అభిమానులు ఈ సినిమా ఎలా ఉన్నా నెత్తిన పెట్టుకుంటారని కొందరు అంటున్నారు.ఆనంద్ దేవరకొండ మూడవ సినిమా తో అయినా కమర్షియల్‌ గా సక్సెస్ ను దక్కించుకుంటాడేమో చూడాలి.

#MiddleClass #Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు