జూ.రౌడీస్టార్‌ పుష్పక విమానం ఎగిరేది ఎప్పుడో క్లారిటీ

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ ఒక వైపు టాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ చిత్రాలతో దూసుకు పోతున్న సమయంలో ఆయన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ దొరసాని అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయింది.

 Anand Devarakonda Movie Pushpaka Vimanam Release Date Details, Actor Vijay Devar-TeluguStop.com

ఆ తర్వాత ఈయన నటించిన మిడిల్ క్లాస్‌ మెలోడీస్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా లో ఆనంద్‌ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆనంద్‌ ముందు ముందు మంచి సినిమాలు చేస్తాడు అంటూ అంతా నమ్మకం ను వ్యక్తం చేశారు.తాజాగా ఈయన పుష్పక విమానం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

దామోదర్ దర్శకత్వంలో రూపొందిన పుష్పక విమానం సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు నవంబర్ 12న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

థియేటర్ల ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రత్యేకంగా ప్రకటించారు.థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతున్న నేపథ్యంలో టాలీవుడ్ నుండి వరుసగా సినిమాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

ఇప్పటికే దసరాకు పలు సినిమాలు క్యూ కట్టాయి.ఇక దీపావళికి కూడా సినిమాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ఆనంద్‌ దేవరకొండ తన పుష్పక విమానంను నవంబర్‌ 12న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

Telugu Pushpakavimanam, Telugu, November, Tollywood-Movie

ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ మూవీగా తెరకెక్కించినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్పక విమానం సినిమా కోసం విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ముందుకు వస్తాడు.కనుక మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.

ఈ సినిమా తర్వాత ఆనంద్‌ దేవరకొండ హైవే అనే సినిమా తో రాబోతున్నాడు.ఆ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube