ఈసారి జూనియర్‌ రౌడీకి పాస్ మార్కులు  

anand devarakonda middle class melodies movie talk , middle class melodies movie,anand devarakonda , varsha, vijay devarakonda brother, middle class melodies movie review - Telugu Anand Devarakonda, Anand Middle Class Melodies, Middle Class Melodies, Varsha Bollama, Vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్‌గా నటించింది.

TeluguStop.com - Anand Devarakonda Middle Class Melodies Movie Talk

చాలా ఆశలు పెట్టుకున్న ఆ సినిమా వారిద్దరికి నిరాశనే మిగిల్చింది.ఇద్దరు కూడా హీరో హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

శివాత్మిక నటన పరంగా పర్వాలేదు అనిపించినా మరీ ఆనంద్‌ మాత్రం ఇతడు హీరో ఏంటో అన్నట్లుగా విమర్శలు ఎదుర్కొన్నాడు.నటన పరంగా విమర్శలు ఎదుర్కొన్న ఆనంద్‌ దేవరకొండ తన రెండవ సినిమాతో కాస్త పర్వాలేదు అనిపించుకున్నాడు.

TeluguStop.com - ఈసారి జూనియర్‌ రౌడీకి పాస్ మార్కులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆనంద్‌ దేవరకొండ తాజాగా మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ మంచి నటన కనబర్చాడు.ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిగా నటించి ఆకట్టుకున్నాడు.సహజత్వం ఉట్టిపడేలా నటించడంలో సక్సెస్‌ అయ్యాడు.

హోటల్‌ పెట్టాలనే ఆశతో జీవిస్తూ.హోటల్‌ పెట్టిన తర్వాత కష్టపడి దాన్ని రన్‌ చేస్తూ వృద్దిలోకి తీసుకు వచ్చేందుకు అతడు పడ్డ కష్టం మన పక్కింటి కుర్రాడు పడ్డట్లుగానే అనిపించింది అంటే అతడు ఎంత సహజంగా నటించాడో అర్థం చేసుకోవచ్చు.

ఆనంద్‌ దేవరకొండ రెండవ సినిమా కమర్షియల్‌ ఫలితాన్ని పక్కన పెడితే మంచి మార్కులు అయితే దక్కించుకున్నాడు.మొదటి సినిమాలో నటుడిగా ఫెయిల్‌ అయిన ఆనంద్‌ ఈ సినిమాలో మాత్రం ఫాస్‌ అవ్వడంతో ఆయన్ను ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభినందిస్తున్నారు.మొత్తానికి అన్న విజయ్‌ దేవరకొండ పేరు నిలిపేందుకు అతడు తీవ్రంగా ప్రయత్నం చేసి సక్సెస్‌ అవుతున్నాడనే చెప్పాలి.మరో రెండు మూడు సినిమాలతో ఆనంద్‌ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని రౌడీ అభిమానులు ఆశిస్తున్నారు.

#Varsha Bollama #MiddleClass #AnandMiddle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anand Devarakonda Middle Class Melodies Movie Talk Related Telugu News,Photos/Pics,Images..