మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ హిట్టా..? ఫ్లాపా..?  

anand devarakonda middle class melodies movie final result, Vijay Devarakonda, Akasam Nihaddura, - Telugu Anand Devarakonda, Director Vinod, Middle Class Melodies First Talk, Varsha Bollamma, Vijay Brother

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజలు వినోదం కోసం ఓటీటీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.మొదట్లో ఓటీటీల్లో విడుదలైన సినిమాలన్నీ ఫ్లాప్ ఫలితాన్ని అందుకోవడంతో నిర్మాతలు సినిమాలు ఫ్లాప్ అవుతాయని ముందే భావించి తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్నారనే కామెంట్లు వ్యక్తమయ్యాయి.

TeluguStop.com - Anand Devarakonda Middle Class Melodies Movie Final Result

అయితే ఆకాశమే నీహద్దురా సినిమా ఓటీటీలో విడుదలై తెలుగు, తమిళ భాషల్లో ప్రశంసలు అందుకుంది.ఓటీటీల్లో విడుదలైన కలర్ ఫోటో, అమ్మోరు తల్లి సినిమాలు సైతం మంచి ఫలితాన్ని అందుకున్నాయి.

నేడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.విడుదలకు ముందే మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా సినిమా అంచనాలను మించి సక్సెస్ అవుతోంది.

TeluguStop.com - మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ హిట్టా.. ఫ్లాపా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నటుడిగా ఆనంద్ దేవరకొండకు మంచిపేరు తెచ్చిపెట్టింది.

తొలి సినిమా దొరసాని అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోకపోయినా అనంద్ దేవరకొండ ఈ సినిమాతో తొలి సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.

ఆనంద్ సినిమాలో బొంబాయి చట్నీ బాగా చేసే రాఘవ పాత్రలో నటించాడు.గుంటూరులో హోటల్ పెట్టాలని.

గుంటూరు వాసులకు తన బొంబాయి చట్నీని రుచి చూపించాలని అనుకున్న రాఘవ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయా.? రాఘవ తను ప్రేమించిన సంధ్యను(వర్ష బొల్లమ్మ) ను పెళ్లి చేసుకున్నాడా.? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథ.

కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు వినోద్ కథనంతో మ్యాజిక్ చేశాడు.సినిమా తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది.హీరో తండ్రి పాత్రలో ఆనంద్ గోపరాజు అద్భుతంగా నటించాడు.

సినిమాకు పాటలు, నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి.థియేటర్లలో విడుదలై ఉంటే మాత్రం ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించి ఉండేది.

#Director Vinod #Varsha Bollamma #MiddleClass #Vijay Brother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anand Devarakonda Middle Class Melodies Movie Final Result Related Telugu News,Photos/Pics,Images..