ఎట్టకేలకు రెండో సినిమాను అనౌన్స్ చేసి దేవరకొండ హీరో  

Anand Devarakonda Announces His Second Movie, Anand Devarakonda, Dorasani, Tollywood News, Vijay Devarakonda - Telugu Anand Devarakonda, Dorasani, Tollywood News, Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ స్టార్‌గా విజయ్ దేవరకొండ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తొలి సక్సె్స్ అందుకున్న దేవరకొండ, అర్జున్ రెడ్డి చిత్రంతో ఇండస్ట్రీని షేక్ చేశాడు.

 Anand Devarakonda Dorasani Arjun Reddy Sivathmikha

ఈ సినిమా బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కడంతో యూత్ ఈ సినిమాకు పట్టం కట్టారు.ఇండస్ట్రీ హిట్ మూవీగా అర్జున్ రెడ్డి నిలవడమే కాకుండా ట్రెండ్ సెట్టర్ మూవీగా మారి విజయ్ దేవరకొండకు కొత్త స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది.

ఇక ఈ హీరో తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ సినిమాల్లోకి దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఇదే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఎట్టకేలకు రెండో సినిమాను అనౌన్స్ చేసి దేవరకొండ హీరో-Gossips-Telugu Tollywood Photo Image

ఈ సినిమా టాక్ పరంగా మంచి విజయాన్ని అందుకున్నా కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు.ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి.

అయితే ఆ సినిమా తరువాత తన నెక్ట్స్ సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు ఆనంద్ దేవరకొండ.దీంతో అసలు ఈయన సినిమాలు చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

గతకొంతకాలంగా తన నెక్ట్స్ మూవీని ప్లాన్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ, తాజాగా తన రెండో సినిమాను ప్రకటించాడు.భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న తాజా చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనున్నాడు.

ఇక ఈ సినిమాను వినోద్ అనంతోజు అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు ‘మిడిల్ క్లాస్ మెమరీస్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.కాగా బిగిల్ సినిమాలో నటించి మెప్పించిన వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఏదేమైనా రెండో చిత్రం కోసం ఈ హీరో చాలానే టైమ్ తీసుకున్నాడు.

#Dorasani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anand Devarakonda Dorasani Arjun Reddy Sivathmikha Related Telugu News,Photos/Pics,Images..