తమ్ముడు రెండు పూర్తి చేస్తే అన్నమాత్రం షూటింగ్‌ షురూ చేయలేదు

విజయ్‌ దేవరకొండ మార్చిలో ఫైటర్‌ సినిమా షూటింగ్‌ ను ఆపేశాడు.అప్పటి నుండి మళ్లీ ఇప్పటి వరకు ఆ సినిమా షూటింగ్‌ లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నది లేదు.

 Anand Devarakonda 3rd Movie Shooting Also Completed ,anand Devarakonda, Vijay De-TeluguStop.com

దర్శకుడు పూరి జగన్నాద్‌ వరుసగా తేదీలు మార్చుతూ వస్తున్నాడు.విజయ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న పూరికి ఏదో ఒక కారణం చెబుతున్నాడట.

వచ్చే నెల నుండి షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అంటున్నారు.మరి ఈ తేదీకి అయిన ఫైటర్‌ పునః ప్రారంభం అవుతుందా అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ముంబయిలో షూటింగ్‌ అంటే విజయ్‌ దేవరకొండ భయపడుతున్నట్లుగా తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ తమ్ముడు మాత్రం ఈ లాక్‌ డౌన్‌ టైమ్‌ లో రెండు సినిమాలను పూర్తి చేశాడు.

తమ్ముడు ఆనంద్‌ కు లేని భయం అన్న రౌడీ స్టార్‌కు ఏంటో అంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.విజయ్‌ దేవరకొండ సినిమాల షూటింగ్‌ విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడో అర్థం అవ్వడంల ఏదు అంటున్నారు.

ఇప్పటికే విజయ్‌ దేవరకొండ ఫైటర్‌ సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు కూడా కమిట్‌ అయ్యాడు.ఆ సినిమాలు త్వరగా మొదలు పెట్టాలంటే ఈ సినిమా షూటింగ్‌లో ఇప్పటికే జాయిన్‌ అవ్వాల్సి ఉంది.

కాని విజయ్‌ దేవరకొండ మాత్రం ఫైటర్‌ లో ఇంకా జాయిన్‌ అవ్వకుండానే శివ నిర్వాన మరియు సుకుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పేశాడు.

Telugu Telugu, Vijay Anand-Movie

మరో వైపు ఆనంద్‌ దేవరకొండ నటించిన మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని రేపు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరో వైపు మూడవ సినిమా షూటింగ్‌ ను కూడా ఆనంద్‌ దేవరకొండ పూర్తి చేశాడట.అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే మార్చి ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయాలని ఆనంద్‌ దేవరకొండ వెయిట్‌ చేస్తున్నాడు.

తమ్ముడు ఈ తక్కువ సమయంలో రెండు సినిమాలు చేయగా విజయ్‌ దేవరకొండ సినిమాలు చేయకపోవడంపై ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube