టీడీపీలో క‌ల‌క‌లం... ఆ ఇద్ద‌రు ఔట్‌..!

నెల్లూరు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి.మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జిల్లా రాజ‌కీయాలు పూట‌కో తీరుగా మారుతున్నాయి.

 Anam Ramanarayana Reddy And Adla Out From Tdp-TeluguStop.com

ఇప్ప‌టికే అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేత‌ల‌తో ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పార్టీకి చేటు చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.

కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, టీడీపీ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌పై సోమిరెడ్డి గుర్రుగా ఉన్నారు.వారికి పార్టీలోనూ, జిల్లా రాజ‌కీయాల్లోనూ ఆయ‌న ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నార‌నే వ్యాఖ్య‌లు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ఎలాగూ పోయింది.ఇక‌, టీడీపీలోనైనా గుర్తింపు ద‌క్కుతుంద‌ని భావించిన ఆనం.టీడీపీలో చేరారు.అయితే, అనూహ్యంగా ఆయ‌న పార్టీలో చేరి నాలుగేళ్లు గ‌డుస్తున్నా.

ఎలాంటి గుర్తింపూ లేకుండా పోయింది.

ఇదే విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన జిల్లా మినీ మ‌హానాడులో ప్ర‌స్తావించారు.రైతులను పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న ఆనం రాంనారాయణరెడ్డి స్వయంగా వెళితే ఎస్‌ఐ, సీఐలు ఖాతరు చేయలేదు.ఈ విషయాన్ని మినీమహానాడులో ఆనం గుర్తు చేస్తూ.30 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తనకు ఈ మాత్రం విలువ కూడా లేకుండా పోయింద‌ని వాపోయారు.ఇదంతా మంత్రి సోమిరెడ్డి కుట్ర అని.ఆనం త‌న అనుచ‌రుల‌తో బాహాటంగానే పేర్కొన‌డం పెను సంచ‌ల‌నంగా మారింది.

త‌నను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తూ.

పరోక్షంగా ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నారని… ఆయన చర్యల వల్ల నెల్లూరులో పార్టీ భూస్థాపితం కానుందని అన‌డం కొస‌మెరుపు.నిజానికి ఆనం సోద‌రులు ఇద్ద‌రికీ గుర్తింపు ఇస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కే వారు పార్టీలో చేరారు.

కానీ ఎలాంటి గుర్తింపు లేకుండానే నాలుగేళ్లు మౌనంగా ఉన్నారు.ఇప్పుడైనా ప‌ట్టించుకోక‌పోతే.

ఎలా అనే ఆనం వ్యాఖ్య‌ల్లో అంత‌రార్థం అర్ధం చేసుకోవాల్సింది.

ఇక‌, ఆదాల ప్ర‌భాక‌ర‌రెడ్డి విష‌యానికి వ‌స్తే.

ఈయ‌న ఎప్ప‌టి నుంచో టీడీపీలోనే ఉన్నాడు.అప్ప‌టి నుంచి కూడా సోమిరెడ్డితో వైరం ఉంది.2004 ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు.ఈ ప‌రిణామం జిల్లాలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ హ‌వా జీరోకి ప‌డిపోయింది.ఇక, ఇప్పుడు కూడా ఆదాల‌కు సోమిరెడ్డి పొగ పెడుతున్నారు.

ప్రభుత్వ పరంగా మాజీ మంత్రి ఆదాలకు రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలకు సోమిరెడ్డి అడ్డుపడడమే కాకుం డా.మీరు బకాయిలు చెల్లిస్తే… ఆదాల పార్టీ మారతారని సోమిరెడ్డి చంద్రబాబుకు నూరిపోస్తున్నారని అంటున్నారు సీనియ‌ర్లు.

దీంతో చంద్ర‌బాబు ఆదాల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశార‌నే టాక్ వ‌స్తోంది.దీంతో ఆనం, ఆదాల ఇద్ద‌రూ కూడా ఇప్పుడు అధినేత చంద్ర‌బాబుపై గుర్రుగా ఉన్నారు.ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే.పార్టీ పుట్టిమున‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌జ‌ల్లో అంత‌గా ప‌లుకుబ‌డి లేని సోమిరెడ్డిని న‌మ్ముకుంటున్న చంద్ర‌బాబు.వాస్త‌వాల‌ను గ‌మ‌నించాల‌ని స్థానిక టీడీపీ నాయ‌కులు కోరుతున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube