మీలో రోగనిరోధక శక్తి ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

Analysis Of Immunity Power In Body

ప్రపంచాన్ని ఏదైనా వణికించింది అంటే అది కరోనా వైరసే.ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మనం ఇప్పుడు తరచు వింటున్న పదం రోగనిరోధక శక్తి.

 Analysis Of Immunity Power In Body-TeluguStop.com

రోగ నిరోధక శక్తి అధికంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అందరూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు.

కానీ మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉందో, లేదో అనే సందేహం చాలామందిలో కలుగుతుంది.మరి రోగనిరోధక శక్తి ఉందా? లేదా అనేది ఎలా తెలుసుకోవాలి ? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.

 Analysis Of Immunity Power In Body-మీలో రోగనిరోధక శక్తి ఉందో లేదో ఇలా తెలుసుకోండి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీరు తరచూ ఒత్తిడికి గురి అవుతుంటే, మీలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు.ఎందుకంటే ఒత్తిడి శరీరం యొక్క లింఫోసైట్లు, తెల్ల రక్త కణాలను తగ్గిస్తుంది.

ఈ లింఫోసైట్లు స్థాయి తక్కువగా ఉంటే, జలుబు వంటి జబ్బు భారిన చాల సులభంగా పడుతారు.

సంవత్సరంలో రెండు మూడు సార్లు జలుబు చేయడం అనేది సాధారణమే, కానీ కొందరిలో ఏడు నుంచి ఎనిమిది సార్లు వరకు జలుబు చేస్తూ ఉంటుంది.ఇలా చేయడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి స్థాయిలు తగ్గినట్టు మనకు సంకేతం.

మీకు తరచూ విరేచనాలు, గ్యాస్ ఏర్పడటం లేదా మలబద్ధకం ఉంటే అవి మీరు రోగనిరోధక వ్యవస్థలో రాజీ పడటానికి సంకేతం కావచ్చు.మీ రోగనిరోధక వ్యవస్థలో దాదాపు 70 శాతం మీ జీర్ణవ్యవస్థలో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
మీకు రోగనిరోధకశక్తి మందగించినట్లు అయితే, మీ చర్మంపై ఏర్పడే పుండ్లు, గాయలు చాలా ఆలస్యంగా నయమవుతాయి.

అలాగే మీరు తరచూ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు.పై లక్షణాలన్నీ తరచు కనిపిస్తూ ఉంటే మీ శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేదని అర్ధం.

#Corona Virus #Analysis #Cough #Immuniti

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube