వింత: మగ తోడు లేకుండా ముగ్గురికి జన్మనిచ్చిన జీవి...ఎక్కడంటే!  

Anaconda Became Pregnant By Herself...gave Birth To Two Babies-

సృష్టి కి మూలం ఆడది అని అంటారు.అలాంటి సృష్టి లో ప్రతి సృష్టి జరగాలి అంటే ఆ ఆడదానికి మగ తోడు అనేది కావాల్సి ఉంటుంది.అది మనిషి అయినా,జంతువు అయినా మగ తోడు కావాల్సి ఉంటుంది.కానీ ఎలాంటి మగ తోడు లేకుండా ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.

Anaconda Became Pregnant By Herself...gave Birth To Two Babies--Anaconda Became Pregnant By Herself...gave Birth To Two Babies-

నిజంగా ఇది నిజం ఎలాంటి మగ తోడు లేకుండా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది.ఇలాంటి వింత ఘటనలు కూడా జరుగుతాయా అని అనిపిస్తుందా.అయితే ఇంతకీ మనం మాట్లాడుతుంది మనిషి గురించి కాదులెండి జంతువు గురించి.ఒక ఆడ జీవి కన్య గానే ఉంది మరో జీవికి జన్మనిచ్చింది.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అమెరికాలోని మసాచు సెట్స్ లో ఈ వింత చోటుచేసుకుంది.ఒక ఆడ అనకొండ మగ అనకొండ తో ఎలాంటి సంబంధం లేకుండానే గర్భం దాల్చి రెండు అడుగుల సైజు ఉన్న రెండు పాములకు జన్మనిచ్చింది.

పది అడుగుల ఆడ అనకొండ పురుష పాముతో కలవకుండానే రెండు పిల్లలకు జన్మనిచ్చిందని న్యూ ఇంగ్లాండ్ ఆక్వేరియమ్ వెల్లడించింది.డీఎన్‌ఏ పరీక్ష ద్వారా తమకు ఈ విషయం తెలిసినట్టు బోస్టన్ ఆక్వేరియమ్ మీడియాకు తెలిపింది.

మొత్తం మూడు పిల్లలు పుట్టగా.ఒక పిల్ల అనకొండ చనిపోయి జన్మించినట్టు పేర్కొన్నారు.జనవరిలో ఈ ఆడ అనకొండ పిల్లలకు జన్మనిచ్చిందని.సంభోగం జరగకుండా పిల్లలు పుట్టినట్టు ధ్రువీకరించడానికి తమకు ఇన్ని నెలల సమయం పట్టినట్టు ఆక్వేరియమ్ సిబ్బంది తెలిపారు.