ప్రజా సేవకే అంకితమైన మహోన్నత వ్యక్తి : దలైలామా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు (సెప్టెంబర్ 1) సంతాపదినంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు ఈ రోజు ప్రణబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 Dalai Lama, Mukherjee, Dead-TeluguStop.com

కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకుడు, నోబెల్ శాంతి గ్రహీత దలైలామా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ గురించి కొన్ని విషయాలను కూమారుడు అభిజిత్ ముఖర్జీకి దలైలామా లేఖ రాశారు.

దలైలామా మాట్లాడుతూ… ‘‘దేశం ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయింది.

ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.అలాంటి వ్యక్తి స్వర్గీయులు అవడం బాధాకరంగా ఉంది.

ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి.నేను చేసే ప్రార్థనల్లో మీ తండ్రిని రోజూ తలుచుకుంటూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తాను.84 ఏళ్లు అర్థవంతమైన జీవితాన్ని గడిపిన మంచి వ్యక్తి ఆయన.మీకు.మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.’’ అంటూ దలైలామా లేఖలో పేర్కొన్నాడు.ప్రజా సేవపై ఎంతో అంకితభావాన్ని కలిగి ఉండేవాడని, ఇద్దరం ఎప్పుడు కలిసినా గౌరవప్రదంగా కలిశామన్నారు.దేశానికి ఎన్నో రంగాల్లో సేవ చేశారని, అనేక మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రపతిగా పదవులు చేపట్టారని దలైలామా కొనియాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube