ఏడాది క్రితం నీటిలో పడ్డ ఐఫోన్.. తాజాగా దానిని ఆన్ చేసి చూడగా..?!

ఎవరైనా ఎంతో ఇష్టపడే ఎన్నో వేల డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ పోతే ఎంత బాధగా ఉంటుందో కదాఅంత ఖరీదు పెట్టి కొన్న ఫోన్ పోయింది అంటే చాలా రోజులు బాధ లోనే ఉండి పోతాము.అయితే అదృష్టం కలిసి వచ్చి పోయిన ఫోను తిరిగి దొరికితే అలాంటి వారిని నిజంగా అదృష్టవంతులు అని చెప్పవచ్చు.

 An Iphone That Fell Into The Water A Year Ago When I Turned It On And Saw It-TeluguStop.com

అయితే తాజాగా తైవాన్ దేశంలో ఓ వ్యక్తి కి సరిగ్గా ఇలాగే జరిగింది కాబోలు.ఎప్పుడో సంవత్సరం క్రితం చెరువు లో పడిపోయిన ఫోన్ తిరిగి మళ్ళీ దొరికింది.

ఏడాది క్రితం తైవాన్ దేశంలో చెన్ అనే వ్యక్తి చెరువులో బోటింగ్ చేస్తున్న సమయంలో తన ఐఫోన్ 11 ప్రో మాక్స్ నీళ్ళలో పారేసుకున్నాడు.ఆ సమయంలో ఆ చెరువులో పెద్ద ఎత్తున నీరు ఉంది.

 An Iphone That Fell Into The Water A Year Ago When I Turned It On And Saw It-ఏడాది క్రితం నీటిలో పడ్డ ఐఫోన్.. తాజాగా దానిని ఆన్ చేసి చూడగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ప్రస్తుతం తైవాన్ లో కరువు రావడంతో దేశంలోని చిన్నచిన్న చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి.

ఇదిలా ఉండగా తాను పారేసుకున్న ఫోన్ చెరువు కూడా తాజాగా ఎండిపోయింది.

అలా పడేసుకున్న ఫోను ని ఓ వ్యక్తి బురద లో ఉన్న ఆ ఫోను గుర్తించి తీసుకున్నాడు.అయితే ఆ వ్యక్తి చెన్ స్నేహితుడు కావడంతో అతని ఫోన్ ను అతనికి అప్పచెప్పాడు.

అలా అప్ప చెప్పిన తర్వాత ఆ ఫోన్ ను బాగా శుభ్రం చేసిన అందులో నీటిశాతం పోయేంతవరకు వేచి చూశాడు.అలా ఆ ఫోన్ పూర్తిగా ఎండిన తర్వాత స్విచ్ ఆన్ చేయగా అది ఇదివరకు కాలంలో ఎలా పని చేస్తుందో అలా పని చేయడం మొదలు పెట్టింది.

దీంతో చెన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

#Working #Iphone #One Year Back #Water

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు