ఆస్ట్రేలియన్ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రేసులో భారత సంతతి యువతి.. ఎవరీ అరుంధతి బెనర్జీ..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.పెద్ద వారితో సమానంగా పిల్లలు, యువతీ యువకులు సైతం సత్తా చాటుతున్నారు.

 An Inspiring Indian Origin-australian Teenager, Arundhati Banerjee , Arundhati B-TeluguStop.com

తాజాగా అరుంధతి బెనర్జీ అనే భారత సంతతి యువతి మోడల్‌గా రాణిస్తూ ఆశ్రయం కల్పించిన దేశానికి, జన్మభూమికి పేరు తెస్తున్నారు.

చెన్నైలో పుట్టిన అరుంధతి.

దక్షిణ ఆస్ట్రేలియాకు వలస వెళ్లడానికి ముందు తన బాల్యాన్ని చెన్నైలోనే గడిపారు.ఈ క్రమంలో పదకొండేళ్ల వయసులో ఆమె కుటుంబం భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది.

భారతదేశంలోనే ఉన్నప్పుడు పద్మశ్రీ శోభనా చంద్రకుమార్ పిళ్లై ఆధ్వర్యంలో 6 సంవత్సరాల పాటు భరత నాట్యంలో అరుంధతి శిక్షణ పొందింది.అలాగే నిరుపమా రాజేంద్ర, ఇందిరా కదండి వద్ద శిక్షణ పొందారు.

కథక్, ఒడిస్సీ వంటి భారతీయ సంప్రదాయ నృత్యరీతులతో పాటు బ్యాలెట్, జాజ్, హిప్ హాప్ వంటి పాశ్చాత్య రూపాలను నేర్చుకున్నారు.

ప్రస్తుతం అడిలైడ్‌లోని ప్లిండర్స్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

అరుంధతి ప్రస్తుతం టోనీ నైట్ వద్ద నటన, థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతున్నారు.అరుంధతిని కుటుంబసభ్యులు అరి అని కూడా పిలుస్తారు.దక్షిణ ఆస్ట్రేలియా మహిళా దినోత్సవం రోజున దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే ఎమర్జింగ్ లీడర్ అవార్డును ఆమె పొందారు.అరుంధతి తన తొలి ప్రొడక్షన్ డ్రిన్సింగ్ సూత్ర ఇన్‌ఫ్రింజ్ ఫెస్టివల్ ద్వారా 3800 ఆస్ట్రేలియా డాలర్లు సేకరించింది.

అలాగే ప్యూర్ ఆర్టిస్ట్రీ అనే బిరుదును సైతం పొందింది.

న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్‌లో కళ, బహుళ సాంస్కృతికతను ప్రోత్సహించడానికి ఆమె చేసిన కృషికి గాను అవార్డును, అలాగే హైఫ్లైయర్ అచీవర్ ఎన్ఆర్ఐ అవార్డ్‌ను అరుంధతి పొందారు.

దీనితో పాటు బోటిక్ సంస్థ బ్రైడల్ ఫ్యూజన్ మాస్సియా బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.బీయూ ఫ్యాషన్‌లో లోర్నా జెన్ కోసం ర్యాంప్‌లో నడిచి గృహ హింస బాధితుల కోసం నిధులను సేకరించింది.

రోటరీ క్లబ్ తరపున ప్రోగ్రామ్ కోల్డ్ ఫ్లంగ్‌తో ఆమె స్వచ్ఛందంగా హోమ్‌లెస్ కోసం నిధులను సేకరించింది.ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ గోల్డెన్ సాష్ అవార్డు, ఫ్యాషన్ ఐకాన్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2019 వంటి అవార్డులను అరుంధతి గెలుచుకున్నారు.

ఇక ఆస్ట్రేలియన్ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ ఎంపిక చేసిన టాప్ 30 మంది పోటీదారులలో అరుంధతి ఒకరు.ఆస్ట్రేలియన్ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2021 కోసం ఆహె ఇప్పటికే స్పాన్సర్‌ను కోరింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube