క్రిమినల్స్ యాక్టివిటీస్‌ను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం.. ఏం చేస్తున్నారంటే.. !

దేశంలో అధికారులు క్రిమినల్స్ యాక్టివిటీస్ తగ్గించడం కోసం ఎంతగా శ్రమిస్తున్నా అనుకున్నంత ఫలితాలు రావడం లేదు.అందుకే ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి పూనుకున్నారు.

 Noida, Traffic Police, Colour Code, Auto, Reduce, Criminal Activities-TeluguStop.com

మనదగ్గర కాదులేండి నొయిడాలో.

ఇకపోతే యూపీలోని నొయిడా సిటీలో చట్టవిరుద్ధమైన పనులు, క్రిమినల్స్ యాక్టివిటీస్ లలో ఇటీవల కాలంలో వెలుగుచూసిన కొన్ని కేసులను పరిశీలించగా, నేగాళ్లకు ఆటోరిక్షావాలాలు తోడ్పడుతున్నట్లు వెల్లడైందట.

అంతే ఈ నేరాలకు చెక్ పెట్టేందుకు వీలుగా కలర్ కోడ్‌ను తీసుకొస్తున్నారట ట్రాఫిక్ పోలీసులు.ఇందులో భాగంగా ఒక్కో ఏరియాకు ఒక్కో కలర్ కోడ్ ఇవ్వనున్నట్లు, తద్వారా ఏ నెంబర్ కోడ్ ఎటు వైపునకు వెళ్తుందో ఈజీగా తెలుసుకోవచ్చునని వెల్లడిస్తున్నారు.

కాగా ఈ విధానం ద్వారా క్రిమినల్స్ యాక్టివిటీస్‌పై నిఘా పెడతామని, అయితే సమగ్రంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చని వారు పేర్కొంటున్నారు.అంటే ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్, క్రిమినల్ యాక్టివిటీస్ తగ్గే అవకాశముందని తెలుస్తుంది.

ఈ విధానం అక్కడ విజయవంతం అయితే మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇప్పుడే అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube