పంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలు, కార్యాలయాలు, స్కూలు తిరిగి తెరుచుకుంటూ వారి సేవలను అందిస్తూ ఉన్నారు.
ఇక కరోనా వైరస్ విజృంభణ తరుణంలో ఇప్పటికి కొన్ని ప్రముఖ కంపెనీలు వారి సిబ్బంది కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీని అందించడంతో ఇంటి నుంచి పని చేస్తున్నారు.ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోం ఫెసిలిటీని ఒక ముగ్గురు స్నేహితులు వర్కింగ్ ఫ్రమ్ సైకిల్ అనే పేరుతో సరికొత్త ఆలోచనతో వినుత ప్రయత్నం చేశారు.
వీరు ముగ్గురు కలిసి వర్క్ ఫ్రొం హోమ్ అవకాశాన్ని ఒక వినూత్న రీతిలో ఉపయోగించుకుంటూ వారి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ సమయంలో వారు వారి ఆఫీస్ పని నిర్వహిస్తూ కూడా ముంబై నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ పై ప్రయాణం చేశారు.
దారిలో ఉండే డాబాలు, లాడ్జి లలో ఉంటూ వారి ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుంటూ దాదాపు 1687 కిలోమీటర్ల సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.రెండు దశాబ్దాలుగా వీరు ముగ్గురు స్నేహితులుగా ఉంటూ వారి సైకిల్ ప్రయాణం అనుభవాలను తెలియచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని చాలా సులువుగా వర్కింగ్ ఫ్రమ్ సైకిల్ అనుభవంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.
కరోనా వైరస్ విజృంభణ సమయంలో వచ్చే నెగిటివ్ ఆలోచనను పక్కన పెట్టి వర్కింగ్ ఫ్రమ్ సైకిల్ ప్రయోగం చేసినట్లు వారు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా వారు ముగ్గురు కూడా ఆఫీస్ వర్క్ నిర్వహిస్తూనే సైకిల్ యాత్ర చేస్తున్నామని తెలియజేశారు.
ఈ ప్రయోగం విజయవంతం అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.