ఆత్మహత్య చేసుకున్న ఐఏఎస్ అధికారి ..!

కర్ణాటక రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిన ఐఎంఏ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ మంగళవారంనాడు అనుమానాస్పద రీతిలో మరణించడం జరిగింది.అయితే అతనిది ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

 An Ias Officer Who Committed Suicide,ias Officer ,suicide,vijay Shankar,cbi,ima,-TeluguStop.com

బెంగళూరు నగరంలోని జయనగర్ లో తన ఫ్లాట్లోనే ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడం రాష్ట్రంలో సంచలనానికి దారి తీసింది.

ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల ” ఐ మానిటరీ అడ్వైజరీ “ సంబందించిన వ్యవహారంలో లంచం తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆ ఐఎఎస్ అధికారి పై ఆరోపణలు ఉన్నాయి.

ఆ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుండి ఏకంగా కోటిన్నర రూపాయలు లంచం తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఐఎస్ అధికారిపై సిబిఐ ప్రధాన అభియోగం చేసింది.ఈ కేసుకు సంబంధించి ఆయన్ను జూలై 8, 2019 న అరెస్ట్ చేయడం జరిగింది.

విచారణ ఖైదీగా ఉన్న అతనికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటికి వచ్చారు.

Telugu Ias, Karnataka, Vijay Shankar-Latest News - Telugu

ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా విచారించేందుకు 2 వారాల క్రితం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కు అనుమతిని ఇచ్చింది.ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ శంకర్ ఒక్కసారిగా ఇలా చేయడంతో కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu Ias, Karnataka, Vijay Shankar-Latest News - Telugu

అసలు కారణమైన ఐఎంఏ జూలర్స్, పేరుతో నిందితుడు మన్సూర్ ఖాన్ కస్టమర్లకు భారీ వడ్డీలు చెల్లిస్తానని ఆశ చూపించి ఏకంగా రూ.400 కోట్లకు పైగా డబ్బులు డిపాజిట్ రూపంలో స్వీకరించిన అనంతరం బోర్డు తిప్పేశాడు.దింతో ఆ సంస్థపై అలాగే మన్సూర్ ఖాన్ పై పోలీసులకు ఫిర్యాదు అందించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube