అమెరికాలో ఓ ఘటన ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది...!!!!  

An Event In America Shocked The World-an Event,birds,dogs,florida,shocked,telugu Nri Updates,world

సాధారణంగా ఇళ్ళల్లో మనం పిల్లిపిల్లల్నో కుక్క పిల్లలనో పెంచుకుంటూ ఉంటాం. అనేక రకాలా పక్షులు, చిన్న చిన్న ప్రాణాలు ఇలా ఇళ్ళలో మన సంతోషం కోసం మూగ ప్రాణులని పెంచుకుంటాం. ఎంతో ప్రేమగా పెంచుకునే జీవాలు మన ప్రాణాలకి ముప్పు అవుతాయని ఎప్పుడూ అనుకోము..

అమెరికాలో ఓ ఘటన ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది...!!!!-An Event In America Shocked The World

కానీ ఇలాంటి ఘటనే అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ప్రపంచం మొత్తం ఈ ఘటనతో నివ్వెర పోయింది. వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ పక్షి తనని సాకిన యజమానిపైనే దాడికిదిగి చంపేసింది. దాంతో ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పక్షి ఏమిటి యజమాని పైనే దాడి ఏమిటి అనుకుంటున్నారా.

నిజమే మీరు వినేది ఆ పక్షి పేరు కాస్సోవరీ. ప్రపంచంలో పక్షి జాతుల్లో అతి పెద్ద పక్షిగా ఎంతో ప్రమాదకరమైన పక్షిగా దానికి పేరుంది.

ఆస్ట్రేలియా , పపువా న్యూ గెనియాలో ఈ జాతికి చెందిన పక్షులు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.

ఈ పక్షులు అంతరించే జాబితాలో ఉండటమే. ఈ రకమైన పక్షిని ఫ్లొరిడాలోని గేన్స్‌విల్లేకు చెందిన వ్యక్తి ఈ పక్షిని పెంచుతున్నాడు. అయితే దానికి దగ్గరకి వెళ్తున్న ఆ యజమాని ఒక్క సారిగా అదుపుతప్పి కింద పడిపోవడంతో ఒక్క సారిగా ఆ పక్షి అతడిపై దూకి పదునైన గోళ్ళతో రక్కిందట..

ఈ పక్షి సుమారు 6 అడుగుల పొడవు, 70 కిలోల బరువు, 10 సెంటీమీటరు వరకూ ఉండే గోళ్ళతో ఉండటంతో మనిషిని చాలా సునాయాసంగా చంపేస్తాయాట. దాంతో ఈ పక్షి ఘటన అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.