ప్రియురాలిని గుర్తుచేసుకొని వేదికపై ఎమోషనల్ అయిన డాన్సర్ పండు?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి.ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 An Emotional Dancer On The Stage Remembering His Girlfriend, Emotional Dancer ,-TeluguStop.com

ఈవారం మంగమ్మ గారి కొడుకు అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్ బుల్లితెర నటీనటులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఆటపాటలతో సందడి చేశారు.

 An Emotional Dancer On The Stage Remembering His Girlfriend, Emotional Dancer ,-TeluguStop.com

ఇకపోతే ఈ ప్రోమో మొత్తం ఎంతో సరదాగా సాగినప్పటికీ చివరికి డాన్సర్ పండు మాత్రం వేదికపై ఎమోషనల్ అవుతూ అందరి చేత కంటతడి పెట్టించారు.

తనకు చిన్నప్పుడే తన తల్లి చనిపోయిందని తల్లిలా చూసుకుని అమ్మాయి ప్రేయసిగా తనకు దొరికిందని తెలిపారు.అచ్చం తన తల్లిలా తన బాగోగులు చూసుకుంటున్న ఆ అమ్మాయి కూడా తన తల్లి వద్దకే వెళ్లిపోయింది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

బహుశా మా అమ్మ పైనుంచి తన కన్నా తన కొడుకుని బాగా చూసుకుంటున్నాడని తనని కూడా తన వద్దకు తీసుకెళ్లిందేమో అంటూ కంటతడి పెట్టుకున్నారు.ఈ విధంగా పండు తన ప్రియురాలి గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ కాగా అక్కడే ఉన్నటువంటి పలువురు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ చూడాలంటే వచ్చే ఆదివారం వరకు వేసి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube