ఓ వ్యక్తికి రూ. 80 కోట్ల విద్యుత్ బిల్లు.. ఆ దెబ్బకు పాపం.. ?

అధికారుల తప్పులు ప్రజల ప్రాణాల మీదికి వస్తాయన్న విషయం తెలిసిందే.అదే ప్రజలు అధికారుల పట్ల ఏదైనా తెలియక తప్పు చేస్తే మాత్రం దాన్ని నేరంగా చూస్తారు.

 Maharashtra, Nalasopara, Electricity Bill, Rs 80 Crore, Per Person,viral Newsmne-TeluguStop.com

ప్రస్తుతం ఇలాంటి ఘటనే జరిగింది.ఆ వివరాలు చూస్తే.

మహారాష్ట్రలోని నలసోపారా పట్టణంలో నివసిస్తున్న 80 ఏళ్ల గణపత్ నాయక్ కి మహరాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారులు షాకిచ్చారు.షాక్ అంటే అలాంటి ఇలాంటి షాక్ కాదు.

అతనింటికి దాదాపు 80 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు పంపించారట.

ఇది ఆ జిల్లాలో వాడిన మొత్తం కరెంట్ బిల్లు కాదు.

మహరాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ వారు పంపిన బిల్లు.ఇక ఆ బిల్లు చూసిన ఆ పెద్దాయనకు హై బీపీ పెరగడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారట.

ఈ విషయం కాస్త ఎంఎస్‌ఇడిసిఎల్ దృష్టికి వెళ్లగా విద్యుత్ బిల్లును సరిచేసి, టైపింగ్ మిస్టేక్ ఫలితంగా వచ్చిందని పేర్కొన్నారు.

ఇక హర్టెటాక్ ఉన్న వారైతే ఈ బిల్లు చూసిన వెంటనే చచ్చేవారు అని కామెంట్స్ చేస్తున్నారట ఈ విషయం తెలిసిన నెటిజన్స్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube