భార్య సర్పంచ్ గా గెలిస్తే భర్తతో ప్రమాణస్వీకారం చేయించిన ఎన్నికల అధికారి

భార్య సర్పంచ్ గా గెలిస్తే భర్తతో ప్రమాణస్వీకారం చేయించిన ఎన్నికల అధికారి.సర్పంచ్ రిజర్వేషనేమో మహిళ ప్రమాణ స్వీకారం చేసింది మాత్రం పురుషుడు.

 An Election Official Who Is Sworn In By The Husband If The Wife Wins As Sarpanch-TeluguStop.com

దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించినా ఎన్నికల అధికారి. మూడు సంవత్సరాల తర్వాత వెలుగులోకి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రమాణ స్వీకారం చేసిన వీడియో.

ఆ గ్రామానికి సర్పంచ్ గా పోటీ చేయడానికి రిజర్వేషన్ మాత్రం మహిళలకు ఉంది మహిళా సర్పంచ్ గా లచ్చనోళ్ళ శ్రీలత సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది.

కానీ ప్రమాణ స్వీకారం మాత్రం సర్పంచ్ భర్త శేఖర్ రెడ్డితో అప్పట్టి ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లింగారెడ్డి గూడా గ్రామంలో ఈ ప్రమాణ స్వీకారం వీడియో వెలుగులోకి వచ్చింది.

మూడు సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారం చేయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు మాత్రం భార్యలు సర్పంచ్ లుగా ఉంటే భర్తల పెత్తనం ఉండకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఏకంగా ఎన్నికల అధికారి భార్య సర్పంచ్ ఉంటే భర్తతో ప్రమాణ స్వీకారం చేయించారు.

దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube