డ్రైవర్ అంటే ఇతనే కాబోలు.. మాములుగా లేవుగా కట్టింగ్స్..!

ఒక్కొక్కళకి ఒక్కో టాలెంట్ ఉంటుంది.అవసరాన్ని బట్టి తమలో ఉన్న టాలెంట్ ను బయటకు తీస్తారు.

 An Auto Drivers Mesmerizes With His Ultimate Driving Skills , Drving, Iviral Vid-TeluguStop.com

అయితే ఈ ఆటో డ్రైవర్ కూడా అంతే అండి.తనలోని టాలెంట్ ను బయటకు తీసాడు.

ఇంకేముంది అతని టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు.అసలు ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ నువ్వు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ అతనిలో ఉన్న టాలెంట్ ఏంటంటే అద్భుతమైన డ్రైవింగ్ అన్నమాట.ఏంటి డ్రైవింగ్ అనేది ఎవరన్నా చేస్తారు.

ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు డ్రైవింగ్ లో ఆరి తేరిపోయి ఉన్నారు అంటారా.కానీ ఈ ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చూస్తే మాత్రం మీరు తప్పకుండా షాక్ అవుతారు.

ఈ వ్యక్తి డ్రైవింగ్ నైపుణం గురించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది.

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఘోర ప్రమాదాలు జరగవచ్చు.ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవచ్చు.

అయితే కొన్ని కొన్ని సార్లు అదృష్టం బాగుండో లేక మనకు ఈ భూమీద బతికే అవకాశం ఉండబట్టో గాని చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన సంఘటనలు చాలానే చూసి ఉంటాము.అయితే ఈ డ్రైవర్ మాత్రం తన డ్రైవింగ్‌ తో అందరికి చెమటలు పట్టిస్తున్నాడు.

డ్రైవింగ్ లో అతను చేసే కట్టింగ్స్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.అసలు ఇలా కూడా రోడ్డుపై ఆటోను నడపవచ్చా అని అంటున్నారు.

ఈ వీడియోలో మనం ఒక ఆటో డ్రైవర్ ఆటో తోలుతూ ముందుకు రావడం చూడవచ్చు.అయితే హఠాత్తుగా ఒక కారు ఆటో దగ్గరకు దూసుకు వచ్చింది.

రెప్ప ముసి తెరిచే లోపే ఆ కారు వేగానికి ఆటో చిత్తు చిత్తు అయిపోవాలి కానీ అక్కడ ఆ విధంగా జరగలేదు.ఆటో డ్రైవర్ తన టాలెంట్ ఉపయోగించి వస్తున్న కారును గమనించి తన ఆటోను చాలా జాగ్రత్తగా కట్ చేశాడు.ఒక పక్కకు ఆటోను వాల్చేసి అదిరిపోయే కటింగ్ ఇచ్చాడు.కారును అసలు టచ్ కూడా చేయకుండా ఆటో ముందుకు వెళ్లిపోవడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.ఈ వీడియోను గడ్డియాన్ వాలే అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.అది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియోలో ఆటో డ్రైవ్ చేసిన డ్రైవర్ గురించి ఎటువంటి వివరాలు తెలియదు.కానీ ఈ డ్రైవర్ టాలెంట్ కి అందరు ఇతన్ని మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube