ముసలి వయసులో కూడా యువకుడిలా ఉండేందుకు తన సీక్రెట్ అదే అంటున్న పెద్దాయన..!

ఓ వ్యక్తి ఒకటి కాదు.రెండు కాదు ఏకంగా 24 ఏళ్లుగా అన్నం తినకుండా కేవలం కొబ్బరి తిని తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

 An Adult Who Says The Same Secret To Stay Young Even In Old Age , Old Man, Lates-TeluguStop.com

అంతేకాదు.ఆరు పదుల వయసు దాటినా పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారికి వ్యాయామాల్లో అద్భుతమైన శిక్షణ ఇస్తున్నారు.

ఆయనే కేరళకు చెందిన బాలక్రిష్ణన్‌ పాలై.

కేరళలోని కాసర్​గడ్​​కు చెందిన పాలై మొదట పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరారు.

ఆ తర్వాత రెవెన్యూ విభాగంలో జాబ్ చేశారు.ఆ సమయంలో పాలై అన్ని రకాల వంటకాలను తినేవారు.

కానీ ఒకసారి అతని అన్నవాహికకు అరుదైన వ్యాధి సోకింది.అది కాస్త తీవ్రం కావడంతో అప్పటి నుంచి పాలై ఏ ఆహారం తిన్నా అది జీర్ణం అయ్యేది కాదు.

దీంతో అతను తరచూ అస్వస్థతకు గురయ్యేవాడు.దీంతో అప్పటి నుండి బాలక్రిష్ణన్‌ అన్నం తినడం పూర్తిగా మానేసి లేత కొబ్బరిని తినడం స్టార్ట్ చేశారు.

అలా అతను 24 ఏళ్లుగా కొబ్బరి అన్నం, కొబ్బరితో చేసిన వంటకాలనే తింటూ జీవనం సాగిస్తున్నారు.

ప్రతిరోజూ కనీసం రెండు కొబ్బరి బొండాలను కొని వాటినే అన్నంగా తీసుకుంటానని పాలై అన్నారు.

కొబ్బరి తినడం మొదలు పెట్టి.దాదాపు 24 సంవత్సరాలు కావొస్తుంది.

ఈ 24 సంవత్సరాలలో ఏ నాడు అనారోగ్యం బారిన పడలేదని ఆయన అన్నారు.ఒకవైపు పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు శిక్షణ ఇస్తూనే.

మరోవైపు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో కూడా ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు.తను 52 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నింగ్‌లో పాల్గొని పలు కప్ లు కూడా సాధించారు.

బాలక్రిష్ణన్‌ దగ్గర శిక్షణ తీసుకున్న పలువురు ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు.ఇంతవయసులోనూ యువకుడిలా చలాకీగా ఉన్న పాలై ని చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube