18 ఏళ్ల యువతికి లాటరీలో జాక్ పాట్... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.290కోట్లు!

‘తంతే బూర్లగంపలో పడ్డాడు’ అని మనకొక నానుడి వుంది.ముఖ్యంగా అదృష్టం వరించినపుడు ఇలాంటి మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి.

 An 18-year-old Girl Won A Jackpot In The Lottery Not One, Not Two, But Rs.290 Cr-TeluguStop.com

అయితే ఇక్కడ ఆమెది అంతకు మించి.అవును, తాజాగా ఓ కెనడా అమ్మాయికి జాక్ పాట్ తగిలింది.

మామ్మూలుగా కాదు, కొడితే కొండను ఢీకొట్టాలంటారు కదా! అయితే ఇక్కడ ఈ అమ్మడు కొట్టకుండానే పెద్ద కొండా పగిలి అందులోనుండి విలువైన సంపద వెలువడింది.అదేనండి ఆమె సరదాగా మొదటిసారి కొన్న లాటరీ టికెట్ ఆమెపై కోట్ల వర్షాన్ని కురిపించింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.290కోట్లు జాక్ పాట్ ఆ అమ్మాయిని వరించడం ఇపుడు సర్వదా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళితే, కెనడాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి అయినటువంటి జూలియెట్ లామర్ ఓ రోజు సరదాగా తనకు సమీపంలో వున్న ఓ లాటరీ ఏజెంటు దగ్గర టికెట్ కొంది.అయితే అదృష్టం ఆమె తలుపు తట్టడంతో తొలి ప్రయత్నంలోనే భారీ లాటరీ తగలడం కొసమెరుపు.

ఇక డ్రాలో గెలుపొందాననే వార్త వినేంత వరకు తాను లాటరీ టికెట్ కొన్న సంగతినే మరిచిపోయానని ఆమె చెప్పడం ఇక్కడ కొసమెరుపు.కాగా సదరు లాటరీలో వచ్చిన సొమ్మును ఆమె జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది.

Telugu Juliet Lamar, Lottery, Latest-Latest News - Telugu

ఇకపోతే అతి చిన్న వయసురాలైన జూలియట్ లామర్ 48 మిలియన్ డాలర్ల భారీ లాటరీని గెలుచుకున్నట్లు అంటారియో లాటరీ అండ్ గేమింగ్ కార్పొరేషన్ ప్రకటించగానే మొదట ఆమె నమ్మలేదట.అంతా కలలాగా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది.కాగా కెనడా లాటరీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న అతిచిన్న వయస్కురాలిగా జూలియట్ లామర్ రికార్డ్ క్రియేట్ చేసింది.జనవరి 7న జరిగిన డ్రాలో లామర్ ఈ మొత్తాన్ని గెలిచింది.

ఆమె తాత లాటరీ టిక్కెట్టు కొనాలని సూచించగా కొన్నానని అంటోంది.మొదటి లాటరీ టిక్కెట్టుకే ఇంత పెద్ద జాక్ పాట్ కొట్టడాన్ని నేను నమ్మలేకపోతున్నానని లామర్ సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube