రెండేళ్ల క్రితమే ప్రియుడితో బ్రేకప్.. పెళ్లికి ముందే తల్లిగా?

పలు దక్షిణాది చిత్రాలలో నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందిన బ్రిటిష్ బామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అమీ జాక్సన్ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన మద్రాస్ పట్నం సినిమా ద్వారా వెండితెరపై తళుక్కుమన్నారు.

 Amy Jackson Breakup With Boy Friend George Panayiotou-TeluguStop.com

ఆ తర్వాత బాలీవుడ్ చిత్రంలో సందడి చేశారు.అలాగే తెలుగులో ఎవడు, అభినేత్రి, శంకర్ దర్శకత్వం వహించిన వంటి చిత్రాల ద్వారా సందడి చేశారు.

అయితే అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.

 Amy Jackson Breakup With Boy Friend George Panayiotou-రెండేళ్ల క్రితమే ప్రియుడితో బ్రేకప్.. పెళ్లికి ముందే తల్లిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోని ఈ బ్యూటీ సినిమాలలో రాణిస్తూనే జార్జ్ పానయిటూ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తూ.

వాళ్ల సహజీవనం కారణంగా పెళ్లి కాకుండానే,తల్లిదండ్రులుగా మారబోతున్నారన్న సంగతి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే మే నెలలో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట కరోనా కారణం వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నారు.

ఈ క్రమంలోనే అమీజాక్సన్ 2019 సెప్టెంబర్ 23న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

Telugu Ami Jackson, Bollywood Actres, Breakup, George Panayioto-Movie

ఈ క్రమంలోనే ఆ బిడ్డకు ఆండ్రియాస్ అని నామకరణం చేశారు.అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న ఈ రిలేషన్ లో కొన్ని మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ఈ కారణం చేతే గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా అమీజాక్సన్ ఇంస్టాగ్రామ్ లో జార్జ్ తో దిగిన ఫోటోలను కూడా డిలీట్ చేయడంతో ప్రస్తుతం వస్తున్న అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

ఈ విధంగా పెళ్లికి ముందే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన రెండు సంవత్సరాలకు బ్రేకప్ చెప్పుకోవడంతో ప్రస్తుతం తన బిడ్డ సంరక్షణ చూసుకుంటూ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తన సన్నిహితులు తెలియజేశారు.

#Breakup #Ami Jackson

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు