కొత్త న్యాయమూర్తిగా అమీకోన్..గుటకలేస్తున్న బిడెన్..!!  

Donald Trump nominates Amy Coney Barrett to be new Supreme Court Justice,Donald Trump, Supreme Court Justice,Amy Coney Barrett,American Elections, Election Results, Americans - Telugu American Elections, Americans, Amy Coney Barrett, Donald Trump, Donald Trump Nominates Amy Coney Barrett To Be New Supreme Court Justice, Election Results, Supreme Court Justice

ఇటీవల కాలంలో అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ మృతి చెందిన విషయం విధితమే.అమెరికాలో అత్యంత కీలకమైన వ్యక్తిగా, అత్యంత శక్తివంతమైన మహిళ న్యాయమూర్తిగా ఉన్న రూత్ మరణం ఎంతో మందిని కలిచి వేసింది.

TeluguStop.com - Amy Coney Barrett New Supreme Court Justice Donald Trump

ఆమె మరణంతో అంతటి అత్యున్నత స్థానంలో మరొక వ్యక్తిని నియమిస్తానని, మళ్ళీ మహిళా న్యాయమూర్తినే నియమిస్తానని ట్రంప్ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.ఎన్నికల సమయంలో ఈ ప్రకటన విన్న డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

నవంబర్ లో ఎన్నికలు పెట్టుకుని ట్రంప్ ఇప్పుడు కొత్తగా మరొక మహిళని ప్రకటిస్తే ఆ ప్రభావం తప్పకుండా ఎన్నికలపై పడుతుందని భావించిన బిడెన్ సరికొత్త వ్యూహాన్ని రచించారు.ఎన్నికలు అయ్యేవరకూ కూడా ఎలాంటి న్యాయమూర్తిని నియమించకూడదని, అందుకు డెమోక్రటిక్ పార్టీ ఒప్పుకోదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

TeluguStop.com - కొత్త న్యాయమూర్తిగా అమీకోన్..గుటకలేస్తున్న బిడెన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలాఉంటే ఒక వైపు ప్రతిపక్షం, విమర్శకులు ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత వెళ్లగక్కుతున్న సమయంలో ఊహించని విధంగా ట్రంప్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అనధికారికంగా ఎంపిక చేసేశారు.

అమీ కోన్ బారెట్ ని అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కి న్యాయమూర్తిగా ట్రంప్ నిర్ణయించారు.

ఇక కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిఉందని తెలుస్తోంది.ఇక కొత్త న్యాయమూర్తి నియామక నిర్ణయం పట్ల డెమోక్రటిక్ పార్టీ , అధ్యక్ష బరిలో ఉన్న బిడెన్ ఆందోళనతో వ్యతిరేకిస్తున్నారు.

అయితే అమీ కోన్ ని న్యాయమూర్తిగా నియమించడానికి ట్రంప్ సెనేట్ లో ఆమోదం పొందాలి, ఎలాగో సెనేట్ లో రిపబ్లికన్ పార్టీ బలం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయానికి కేవలం అధికారిక ముద్ర పడటమే తరువాయి.అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక అమెరికా మహిళకి మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన కారణంగా అమెరికన్స్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ట్రంప్ కి మద్దతు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

అంతేకాదు జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ ఎలాంటి అభ్యంతరం తెలిపి కోర్టు దృష్టిలో ఉంచినా ట్రంప్ కి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకే తాజాగా అమెరికా అధ్యక్ష రిజల్ట్ సుప్రీంకోర్టు చేతుల్లో ఉందని అన్నారని గుర్తు చేస్తున్నారు డెమోక్రాట్లు.

#Americans #SupremeCourt #DonaldTrump #Donald Trump

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Amy Coney Barrett New Supreme Court Justice Donald Trump Related Telugu News,Photos/Pics,Images..