కరుణానిధికి అమూల్ నివాళి.సోషల్ మీడియాలో వైరల్  

Amul Tribute To ‘thalaivar’ Karunanidhi-

ఇటీవల మరణించిన కరుణానిధికి అమూల్ వినూత్నశైలిలో నివాళులు అర్పించింది.భారత అడ్వర్టైజింగ్ రంగంలో అమూల్ ప్రత్యేకత తెలిసింది.ఇప్పుడు కరుణకి నివాళులు అర్పించిన విషయంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంది అమూల్.అమూల్ చేసిన ట్వీట్ కి నెటిజన్లు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

Amul Tribute To ‘thalaivar’ Karunanidhi--Amul Tribute To ‘Thalaivar’ Karunanidhi-

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రికి నివాళులర్పిస్తూ సంతాపంగా చేసిన ట్వీట్లో కరుణానిది ది తమిళ్ తలైవర్ అంటూ సంభోదించింది.అమూల్ తన ట్వీట్‌లో ‘ది తమిళ్ తలైవార్.

ఎం.కరుణానిధి.

1924-2018 అంటూ ఫోటో పెట్టారు.అందులో వీల్‌ఛైర్‌లో కూర్చొన్న కరుణకు.అమూల్ బేబీ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు ఉంది.ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

కరుణానిధిని గొప్ప రచయిత, రాజకీయ నేతగా అభివర్ణించింది అమూల్.సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ట్వీట్కు ఇప్పటికే 1600పైగా రీ ట్వీట్లు వచ్చాయి.అంతేకాదు 5,00వేలకుపైగా లైక్‌లు వచ్చాయి.ఈ ట్వీట్ చూసిన అభిమానులు కరుణని చూసి ఎమోషనల్ అయ్యారు,అమూల్ క్రియేటివిటీని గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.