డచ్ ఎయిర్ లైన్స్ ని వెనక్కి పంపిన అధికారులు... కరోనా ఎఫెక్ట్

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విదేశాల నుంచి ఇండియాలోకి అడుగు పెట్టె వారిపై భారత్ ప్రభుత్వం నిషేధం విధించింది.విదేశీయులు ఎవరు కూడా ఇండియాలో అడుగుపెట్టవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 Amsterdam Delhi Flight Turned Back Due To Covid 19-TeluguStop.com

కరోనాపై యుద్ధం ప్రకటించి దానిని కంట్రో చేయడానికి జనతా కర్ఫ్యూ కూడా పాటిస్తుంది.ఇక దేశం యావత్తు ఈ రోజు లాక్ డౌన్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ విమానంలోని విదేశీ ప్రయాణికులను భారత్ బలవంతంగా తిప్పి పంపించింది.

పలు దేశాలకు చెందిన ప్రయాణికులు డచ్ రాజధాని నగరమైన ఆమ్‌స్టర్‌డామ్ నుంచి ఢిల్లీకి వచ్చారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో విదేశీ ప్రయాణికులపై నిషేధం ఉండటంతో తాము అనుమతించలేమని నిర్దాక్షిణ్యంగా తిరిగి వారందరిని వెనక్కి పంపించేసింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రోషియా, సిప్రస్, సీజెచ్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈస్టోనియా, మాల్టా, నెదర్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లిథూనియా, లక్సెంబర్గ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్పెయిన్, స్వీడన్, ఐస్ లాండ్, నార్వే, స్విట్జర్లాండ్,టర్కీ, యూకే దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై నిషేధం కొనసాగిస్తుంది.

ఈ నిషేధం ఈ నెల ఆఖరు వరకు కొనసాగుతుంది అని ప్రభుత్వ విదేశాంగ అధికారులు స్పష్టం చేశారు.ఈ కారణంగానే ఎయిర్ లైన్స్ ని వెనక్కి పంపించడం జరిగిందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube